Coronavirus : దేశంలో పెరిగిన కరోనా కేసులు

బుధవారం దేశంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 37, 875 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.

Coronavirus

Coronavirus : కరోనా కొత్త కేసులు ఓ రోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం తగ్గిన కరోనా కొత్త కేసులు, బుధవారం పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 37,875 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 30లక్షల 96వేల 718 కి చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,91256కు చేరింది. దేశంలో అత్యధిక కేసులు కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడ మంగళవారం 25,772 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.51 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 369 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,41,411 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 39,114 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,22,64,051 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 70,75,43,018 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో మాత్రం 78,47,625 మందికి వ్యాక్సిన్‌ వేసింది ఆరోగ్య శాఖ.