Traffic: ఇంత చిన్న పిల్లాడు ట్రాఫిక్ సమస్యపై ఎంత గొప్పగా ఆలోచించాడో చూడండి..
ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. కారు బొమ్మలతో ఆ పిల్లాడు..

Car toys
బెంగుళూరులో ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఉంటాయన్న విషయంపై అక్కడి పిల్లలకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. రెండున్నరేళ్ల పిల్లాడు బొమ్మలతో బెంగళూరు ట్రాఫిక్ వ్యధను తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ట్రాఫిక్ జామ్ గురించి తన మేనల్లుడు కార్ గేమ్స్ ఆడుకుంటున్నాడంటూ ఈ ఫొటోను పవన్ భట్ కుందాపుర అనే వ్యక్తి తెలిపాడు. అంత చిన్న పిల్లాడు ఇంత చక్కగా ట్రాఫిక్ కష్టాల గురించి కళాత్మకంగా సూచించడం గొప్ప విషయమంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కారు బొమ్మలతో ఆ పిల్లాడు ట్రాఫిక్ సమస్యను చూపించాడు. అలాగే, అందరూ లైన్‌గా వెళ్లాలన్న అర్థమూ ఇందులో ఉంది.
ట్రాఫిక్ సమస్యల గురించి ఎన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగుళూరు ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతుంటారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇటీవల ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఓ వధువు సమయానికి వివాహ వేదికకు చేరుకోవడానికి మెట్రో రైల్ ఎక్కాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్‌గా మారింది.
My 2.5 year old nephew is so Bangalorean that his car games also have a traffic jam ? @peakbengaluru pic.twitter.com/QFjxVEmsoH
— Pavan Bhat Kundapura (@pavanbhatk) January 28, 2024