Family Star : రష్మిక బర్త్‌డే రోజే విజయ్ సినిమా.. కోఇన్సిడెన్సా? కావాలని ప్లాన్ చేశారా? ఆడుకుంటున్న నెటిజన్లు..

ఫ్యామిలీ స్టార్ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ డేట్ కి విజయ్ దేవరకొండ సినిమా వస్తుండటంతో వైరల్ గా మారింది.

Family Star : రష్మిక బర్త్‌డే రోజే విజయ్ సినిమా.. కోఇన్సిడెన్సా? కావాలని ప్లాన్ చేశారా? ఆడుకుంటున్న నెటిజన్లు..

Vijay Deverakonda Family Star Movie Coming on Rashmika Mandanna Birthday is it Co incidence or Planning

Updated On : February 3, 2024 / 5:47 PM IST

Family Star : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాని మొన్న సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించి తర్వాత వాయిదా వేశారు. నిన్నే ఈ ఫ్యామిలీ స్టార్ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్.

ఆ డేట్ లో ఎన్టీఆర్ దేవర(Devara) సినిమాని మొదట ప్రకటించారు. గత కొన్ని రోజులుగా దేవర సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. దిల్ రాజు కూడా దేవర వాయిదా పడితే ఫ్యామిలీ స్టార్ సినిమాని తీసుకొస్తామని చెప్పాడు. అయితే అధికారికంగా దేవర వాయిదా అని చెప్పకుండానే ఫ్యామిలీ స్టార్ డేట్ అనౌన్స్ చేయడంతో దేవర సినిమా వాయిదా అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ డేట్ కి విజయ్ దేవరకొండ సినిమా వస్తుండటంతో వైరల్ గా మారింది.

Also Read : Dasari Kondappa : దిల్ రాజు మంచి మనసు.. పద్మశ్రీ వచ్చిన ‘బలగం’ కళాకారుడికి లక్ష రూపాయలు..

విజయ్ – రష్మిక(Rashmika Mandanna) మధ్య ఏదో ఉందని, ప్రేమలో ఉన్నారని, డేటింగ్ లో ఉన్నారని వార్తలు రెగ్యులర్ గా వస్తునే ఉన్నాయి. వారిద్దరూ ఈ వార్తలు ఖండించినా వాళ్ళు చేసే పనులు, ఒకరి గురించి ఒకరు మాట్లాడే విధానంతో వారి మధ్య ఏదో ఉందనే అంతా అనుకుంటున్నారు. అయితే రష్మిక పుట్టిన రోజు ఏప్రిల్ 5. ఇప్పుడు అదే రోజు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఇది కోఇన్సిడెన్సా? లేక కావాలని ప్లాన్ చేశారా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పలువురు దీనిపై పోస్టులు కూడా చేస్తూ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ రకంగా అయినా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ అవుతుంటే, రష్మిక పుట్టిన రోజు నాడే విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ చేస్తుండటంతో మరోసారి ఈ ఇద్దరూ వైరల్ అవుతున్నారు. రిలీజ్ రోజు ఇద్దరూ కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్, సినిమా సెలబ్రేషన్స్ చేసుకున్నా ఆశ్చర్యపోనకవసరం లేదు.