Dasari Kondappa : దిల్ రాజు మంచి మనసు.. పద్మశ్రీ వచ్చిన ‘బలగం’ కళాకారుడికి లక్ష రూపాయలు..

తాజాగా దాసరి కొండప్పకి పద్మశ్రీ వచ్చినందుకు బలగం చిత్రయూనిట్ అంతా ఆయన్ని సన్మానించారు.

Dasari Kondappa : దిల్ రాజు మంచి మనసు.. పద్మశ్రీ వచ్చిన ‘బలగం’ కళాకారుడికి లక్ష రూపాయలు..

Dil Raju and Balagam Movie Unit Felicitation to Dasari Kondappa for Selectiong to Padmashri Award

Updated On : February 3, 2024 / 3:16 PM IST

Dasari Kondappa : ఇటీవల కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. బుర్రవీణ సంగీత పరికరంతో పలు పల్లెజానపదాలు పాడుతూ తెలంగాణ సంసృతిని చాటుతున్నారు దాసరి కొండప్ప. ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో కూడా దాసరి కొండప్ప ఒక పాట పాడి నటించారు కూడా.

Also Read : Sandeep Vanga : సందీప్ వంగ సినిమాలపై అమీర్ ఖాన్ మాజీ భార్య కామెంట్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన సందీప్ వంగ..

తాజాగా దాసరి కొండప్పకి పద్మశ్రీ వచ్చినందుకు బలగం చిత్రయూనిట్ అంతా ఆయన్ని సన్మానించారు. దాసరి కొండప్పని దిల్ రాజు ఆఫీస్ కి తీసుకొచ్చి, ఆయనతో ఓ పాట పాడించి దిల్ రాజు, వేణు, పలువురు చిత్రయూనిట్ ఆయన్ని సన్మానించారు. అనంతరం దిల్ రాజు లక్ష రూపాయల చెక్కుని ఆయనకు అందచేశారు. ఆ డబ్బులని ఆ పెద్దాయన కోసం మాత్రమే వాడాలని దిల్ రాజు చెప్పారు. ఈ వీడియోని దిల్ రాజు టీం తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పలువురు దిల్ రాజుని అభినందిస్తున్నారు.