దేశవ్యాప్తంగా గణేశ్ సంబరాల్లో టాప్ 10 సిటీలు ఇవే..

జై బోలో గణేశ్ మహరాజ్‌కీ.. జై.. మరి కొద్ది రోజుల్లో తీన్ మార్ డప్పులతో దేశమంతటా వినిపించనున్న నినాదం ఇదే. హిందువులు అత్యంత ప్రాముఖ్యంగా భావించి జరుపుకునే పండుగ వినాయకచవితి. గజ ముఖ గణేశుడి.. సంబరాలకు దేశమంతా హోరెత్తిపోతుంది. ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకునే సిటీల్లో టాప్ 10గా ఉండేవేంటో తెలుసా..
ముంబై:
ముంబై వేదికగా వినాయకచవితి చాలా స్పెషల్ గా చేస్తారు. 6వేలకు పైగా విగ్రహ ప్రతిష్ఠలు చేసి సంబరాలు జరుపుకుంటారు. మరాఠా రూలర్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ తో పాటు లోకమాన్య తిలక్ కూడా అక్కడ సెలబ్రేషన్స్ ను బాగా ప్రమోట్ చేశారు. అరేబియా సముద్రంలో నిమజ్జనంతో పండుగ పూర్తవుతుంది.
పూణె:
మహారాష్ట్రలో ముంబై తర్వాత సెలబ్రేట్ చేసుకునేది పూణెలోనే.
హైదరాబాద్:
ముంబైకి మించి హైదరాబాద్ వ్యాప్తంగా 75వేలకు మించి గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తారు. ఖైరతాబాద్, కమలానగర్ బాలాపూర్, చైతన్యపురి, దుర్గం చెరువు, న్యూ నాగోల్, పాత బస్తీలలో మెయిన్ స్పాట్లుగా పెద్ద ఎత్తులో విగ్రహాలు ఏర్పాటు చేసి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం పూర్తి చేస్తారు.
గోవా:
అందమైన ప్రదేశమైన గోవాలో మనసులు.. మనుషులు పెద్ద ఎత్తులో కలిసేది ఈ పండుగకే.
గణపతిపూలె:
గణపతిపూలె కూడా మహారాష్ట్ర కొంకణ్ తీరంలోని గ్రామం ఇది. 400 సంవత్సరాల పురాతన దేవాలయం భక్తులతో కిటకిటలాడిపోతుంది.
కాణిపాకం:
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గ్రామం కాణిపాకం. ఇక్కడ వరసిద్ధి వినాయక టెంపుల్ ఫ్యామస్.. ఇక్కడ నీటిలో మునిగి ఉండే వినాయక విగ్రహానికి లోతును కనుక్కుందామని ఎంత ప్రయత్నించినా అంతుచిక్కలేదట. రోజుకొకలా అలంకరించి వినాయక నిమజ్జనం వరకూ అద్భుతంగా కన్నుల పండుగగా సెలబ్రేట్ చేస్తుంటారు.
బెంగళూరు:
బెంగళూరులో 3 గణేశ్ టెంపుల్స్ చాలా ఫ్యామస్. పంచముఖ హెరాంబ గణపతి టెంపుల్, అనంతనగర్ గణపతి టెంపుల్, శ్రీ జంబూ గణపతి టెంపుల్. ఈ వేదికగా బాగా సెలబ్రేట్ చేసి ఉల్సూర్ లేక్, సాంకీ ట్యాంక్ లలో నిమజ్జనం చేసి పండుగ పూర్తి చేసుకుంటారు.
తిరువనంతపురం:
వినాయకచవితి పండుగ పెద్ద ఎత్తులో జరుపుకునే చోటు ఇది. ఎకో ఫ్రెండ్లీ గణేశ్ ఇక్కడ ఫ్యామస్. బురదతో పాటు పాలతో విగ్రహాలను తయారుచేసి పండుగతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు.
చెన్నై:
ముంబైలో సెలబ్రేట్ చేసినంత ఫ్యామస్ గా.. చెన్నైలోనూ అంతే రేంజ్ లో జరుపుకుంటారు. చిక్కీ, లడ్డూలు, మైసూర్ పాక్ లాంటి స్వీట్లు పండుగ రోజుల్లో స్పెషల్ గా తయారుచేస్తారు.
దివీగర్:
మహారాష్ట్రలో ఉండే చిన్న గ్రామం ఇది. జన్మాష్టమి, గణేశ చతుర్థిలు ఇక్కడ ప్రధాన పండుగలు. 300 సంవత్సరాల పురాతన దేవాలయం ఇది.