Yamuna River in Delhi
Yamuna River Pollution: దీపావళి పండుగ సమయం దగ్గరపడుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని పొగ, కాలుష్యం కమ్మేస్తోంది. దీపావళికి ముందే ఢిల్లీ ఎన్సీఆర్ లో గాలి నాణ్యత క్షీణించింది. దీంతో కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజుల నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ లో కాలుష్య నివారణకు మొదటి దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) అమలవుతోంది.
మరోవైపు.. ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో యమునా నదిపై ప్రమాదకరమైన తెల్లటి నురగ చేరింది. దీంతో యమునా పరిసర ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యం, వన్య ప్రాణులను ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛత్ పూజ సమీపిస్తున్నందున కాలుష్య నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. శ్వాసకోశ, చర్మ సమస్యలతో సహా, మరిన్ని అనారోగ్యాలను కలిగించేలా అమ్మోనియా ఫాస్ఫేట్‌లను కలిగిఉన్న నురుగు
యమునా నీటిలో అధికంగా ఉంది. కుళ్లిపోయిన మొక్కలు, కాలుష్య కారకాలు నీటిలో కలిసినప్పుడు నురగ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వరదలు లేకపోవడం వల్ల కాలుష్య కారకాలు నదిలో ఉండడం వల్ల నురుగు ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు.
#WATCH | Delhi: Toxic foam seen floating on the Yamuna River. Visuals from Kalindi Kunj. pic.twitter.com/5KSQRjerSC
— ANI (@ANI) October 18, 2024