Traffic E-Challan : ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఈ ట్రాఫిక్ చలాన్లపై కొత్త రూల్

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జారీచేసే ఈ-ట్రాఫిక్‌ చలాన్లపై కేంద్ర రవాణాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Traffic E-Challan : ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జారీచేసే ఈ-ట్రాఫిక్‌ చలాన్లపై కేంద్ర రవాణాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ట్రాఫిక్‌ ఉల్లంఘన జరిగిన 15 రోజుల్లోగా చలాన్‌ నోటీసులు పంపించాలని, చెల్లింపు జరిగేంత వరకు ఉల్లంఘనపై ఎలక్ట్రానిక్‌ ఆధారాలను భద్రపరచాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ మేరకు మోటర్‌ వెహికిల్‌ యాక్ట్‌-1989 ఫర్‌ ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ సేఫ్టీ నిబంధనలకు సవరణలు చేసింది.

Read More : Jobs : మౌలానా అజాద్ ఇన్ స్టిట్యూట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

కొత్త నిబంధనల ప్రకారం.. జాతీయ, రాష్ట్ర రహదారులపై అధిక రద్దీతో పాటు ప్రమాదం జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో.. అలాగే 10 లక్షల పైచిలుకు జనాభా కలిగిన అన్ని పట్టణాల్లో ఎలక్ట్రానిక్‌ ట్రాఫిక్‌ భద్రతా నియంత్రణ సాధనాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. వాహనదారులకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగని రీతిలో వీటిని అమర్చాలని చెప్పింది. ఈ-చలాన్‌ వ్యవస్థను 2019లో ఢిల్లీలో ప్రారంభించారు.

Read More : Sravana Masam : తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ, వరలక్ష్మీకి మహిళల ప్రత్యేక పూజల

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ విధానం అందుబాటులో ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 19 నగరాల్లో, యూపీలో 17, ఏపీలో 13, పంజాబ్‌లో 9 నగరాల్లో ఈ విధానం అమల్లో ఉంది.  కొత్త రూల్ ప్రకారం…ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించడానికి స్పీడ్ కెమెరా, శరీరంపై ధరించే కెమెరా, స్పీడ్ గన్, సీసీటీవీ కెమెరా, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, డ్యాష్ బోర్డు కెమెరా తదితర సాంకేతిక పరికరాలను ఉపయోగించుకొనే వీలుంది.

ట్రెండింగ్ వార్తలు