Family Drown In Pond : తీవ్ర విషాదం.. టిఫిన్ బాక్స్ కడిగేందుకు వెళ్లి మృత్యువాత.. చెరువులో పడి ఐదుగురు మృతి

మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చెరువులో మునిగి చనిపోయారు.

Family Drown In Pond : తీవ్ర విషాదం.. టిఫిన్ బాక్స్ కడిగేందుకు వెళ్లి మృత్యువాత.. చెరువులో పడి ఐదుగురు మృతి

Updated On : August 21, 2022 / 11:30 PM IST

Family Drown In Pond : మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చెరువులో మునిగి చనిపోయారు. ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు.. బడి దర్గా వద్ద ప్రార్థనలు చేసేందుకు వెళ్లారు. అక్కడే భోజనాలు చేశారు. ఆ తర్వాత టిఫిన్ బాక్స్ కడిగేందుకు ఒకరు చెరువు దగ్గరికి వెళ్లారు. ప్రమాదవశాత్తు అతడు నీటిలో పడిపోయాడు. ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో మిగిలినవారు నీళ్లలోకి దూకారు. వారు కూడా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

నీటిలో మునిగిపోతున్న ముగ్గురు బాధితులు సాయం కోసం అర్థించారు. తమను కాపాడాలని కేకలు వేశారు. దీంతో మిగతా ఇద్దరు కూడా చెరువులో దూకేశారు. అయితే వారు కూడా నీటిలో మునిగి మరణించారు. ఈ ఘటనలో ఐదుగురూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చెరువులో పడి చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

నాందేడ్ జిల్లాలోని కందహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవరంగ్ పురాలో మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.