Haridwar Superfast Express : 20 నిమిషాలు ముందే చేరుకున్న రైలు..బోగీలోంచి దిగి ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణీకులు డ్యాన్స్

20 నిమిషాలు ముందే చేరుకుంది ఓ రైలు. దీంతో ప్రయాణీకులు ఆనందంతో బోగీలోంచి దిగి ప్లాట్‌ఫామ్ డ్యాన్సులతో ఇరగదీశారు.

Haridwar Superfast Express : 20 నిమిషాలు ముందే చేరుకున్న రైలు..బోగీలోంచి దిగి ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణీకులు డ్యాన్స్

Train Reached Ratlam Station 20 Minutes Ago..passengers Garba Dance

Updated On : May 27, 2022 / 10:19 AM IST

Train reached Ratlam station 20 minutes ago..passengers garba dance : ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటారు. రైళ్లు అనుకున్న సమయానికి ఎప్పుడూ రావు..ఎప్పుడూ ఆలస్యమే. వాటి టైమ్ ప్రకారం వస్తే ప్రయాణీకుల ఎంతో ఆనందపడిపోతారు. కానీ రావాల్సిన సమయానికి కంటే ముందే రైలు వచ్చేస్తే..రావాల్సిన సమయానికంటే ముందుగానే రైలు చేరాల్సిన చోటికి చేరితే..వావ్ ఇక ప్రయాణీకుల ఆనందానికి అంతే ఉండదు..ఈ ఆనందంలో డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అనేలా ఉంటారు. అలా ఓ రైలు అనుకున్న సమాయానికంటే ముందే వచ్చినందుకు ప్లాట్‌ఫామ్ పై డ్యాన్సులు వేశారు ప్రయాణీకులు దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హ‌రిద్వార్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం (మే 25,2022) రాత్రి దాని షెడ్యూల్ సమయానికి కంటే 20 నిమిషాల ముందే ర‌త్‌లాం స్టేష‌న్‌కి చేరుకుంది. అది చూసిన ప్రయాణీకులు తెగ ఆనందపడిపోయారు. ఓ బోగీలోని ప్ర‌యాణికులు గ‌ర్భా డ్యాన్స్ చేయ‌డం ప్రారంభించేశారు. గుజ‌రాత్‌లో అత్యంత హిట్ కొట్టిన పాట‌లు, బాలీవుడ్ పాట‌ల‌పై కూడా డ్యాన్స్ చేశారు. కాసేపు ఏం జ‌రుగుతుందో అక్క‌డెవ్వ‌రికీ అర్థం కాలేదు. ఆ త‌ర్వాత అర్థం చేసుకొని… చిన్న పిల్ల‌లు మొద‌లుకొని, వృద్ధుల వ‌ర‌కూ అందరు కలిసి డ్యాన్స్ వేశారు.

దాదాపు 90 మందితో వున్న ఓ బృందం గుజ‌రాత్ నుంచి కేదార్‌నాథ్ బ‌య‌ల్దేరింది. కేటాయించిన స‌మ‌యం కంటే 20 నిమిషాల ముందే ర‌త్‌లాం అనే స్టేష‌న్‌కి చేరుకుంది. అంతే… అల‌స‌ట తీర్చుకోవ‌డానికి… చాలా మంది ప్లాట్‌ఫాంపైకి వ‌చ్చేసి, డ్యాన్స్ చేశారు. 20 నిమిషాల పాటు అదే బోగీలో కూర్చునే బదులు… ఇలా డ్యాన్స్ చేస్తే అల‌స‌ట తీరిపోతుంద‌నే ఇలా చేశామ‌ని ప్ర‌యాణికులు తెలిపారు.