Truck Reverse Gear : బ్రేకులు ఫెయిల్.. 3 కి.మీ రివర్స్ గేర్‌లోనే నడిపిన ట్రక్ డ్రైవర్..
ట్రక్ డ్రైవర్ మూడు కిలోమీటర్ల దూరం రివర్స్ గేర్‌లో వాహనాన్ని నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Truck Driver Drives 3 Km In Reverse Gear To Prevent Accident After Brake Failure
Truck Reverse Gear : ట్రక్ డ్రైవర్ మూడు కిలోమీటర్ల దూరం రివర్స్ గేర్‌లో వాహనాన్ని నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రక్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందుకు వెళ్తే ప్రమాదమని భావించి అలాగే ట్రక్ రివర్స్ గేర్ లో డ్రైవ్ చేశాడు.
ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా- సిల్లోడ్ హైవేపై జరిగింది. రివర్స్ గేర్ లో వెళ్తున్న ట్రక్ డ్రైవర్‌కు కొంతమంది బైకర్లు ట్రాఫిక్ క్లియర్ చేశారు. రోడ్డుపై ట్రక్ డ్రైవర్ రివర్స్ గేర్‌లో మూడు కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అలా వెళ్లిన వాహనాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రక్కును పోలాల్లోకి తిప్పాడు.
అలా ట్రక్కు వేగాన్ని డ్రైవర్ కంట్రోల్ చేయగలిగాడు. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి బైకర్ల సాయంతో పెద్ద రోడ్డు ప్రమాదాన్ని తప్పించాడు. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఆన్‌లైన్‌లో కనిపించిన ఈ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 13 లక్షలకు పైగా వీక్షించారు.