Twitter Blue Tick: ఆర్ఎస్ఎస్ కీలక నేతలకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. బ్లూ టిక్ రిమూవ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, అతని సహచరులు సురేష్ సోని, అరుణ్ కుమార్, సురేష్ జోషి, కృష్ణ కుమార్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతకు ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది.

twitter blue tick: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, అతని సహచరులు సురేష్ సోని, అరుణ్ కుమార్, సురేష్ జోషి, కృష్ణ కుమార్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతకు ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ కు ఫైనల్ వార్నింగ్​ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ట్విట్టర్ బ్లూ టిక్ తీసేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శనివారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతా ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించడం కలకలం రేపింది.

దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ఉప రాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ యాజమాన్యాన్ని వివరణ కోరింది. దీనిపై స్పందించిన ట్విట్టర్ కార్యాలయ ప్రతినిధులు ఖాత యాక్టివ్ గా లేని మూలంగా తొలగించడం జరిగిందని తెలిపారు. కొద్దీ సేపటికి తిరిగి బ్లూ టిక్ ను పునరుద్ధరించారు.

ఇక ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ కి సంబందించిన కీలక వ్యక్తుల ట్విట్టర్ ఖాతాలకు కూడా బ్లూటిక్ తీసేయడం విమర్శలకు తావిస్తుంది. వ్యక్తిగత ఖాతాకు బ్లూ టిక్ తొలగించబడిన వారు కృష్ణ కుమార్, అరుణ్ కుమార్ లు ఆర్‌ఎస్‌ఎస్‌లో సంయుక్త ప్రధాన కార్యదర్శుల పదవిలో ఉండగా, సురేష్ ‘భయ్యాజీ’ జోషి గతంలో సంయుక్త ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సురేష్ సోని ఆర్ఎస్ఎస్ సీనియర్ సభ్యుడు.

ట్రెండింగ్ వార్తలు