Train Accident : ఢీకున్న రెండు రైళ్లు.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

లోకో పైలెట్ వికాస్ కుమార్ తలకు బలమైన గాయమైందని, అతని పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం..

Train Accident : ఢీకున్న రెండు రైళ్లు.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

Train Accident

Updated On : June 2, 2024 / 10:02 AM IST

Fatehgarh Sahib Accident : పంజాబ్ రాష్ట్రంలోని ఫతేఘర్ సాహిబ్ లో ఆదివారం తెల్లవారు జామున రెండు గూడ్స్ రైళ్లు ఢీకున్నాయి. వీటిలో ఒకదాని ఇంజన్ అదుపుతప్పి పక్క ట్రాక్ పై ప్రయాణిస్తున్న ఫ్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ రైళ్లు ఇంజిన్ భాగాలు, భోగీలు దెబ్బతిన్నాయి. ఇద్దరు లోకో పైలట్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని యూపీకి చెందిన వికాస్ కుమార్, హిమన్షు కుమార్ గా గుర్తించారు. వారిని అంబులెన్స్ సహాయంతో పాటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Also Read : అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ఎవరున్నారంటే?

లోకో పైలెట్ వికాస్ కుమార్ తలకు బలమైన గాయమైందని, అతని పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో పెద్ద ప్రాణనష్టం తప్పినట్లు సమాచారం. గూడ్స్ రైళ్లకోసం నిర్మించిన డీఎఫ్సీసీ ట్రాక్ న్యూసిర్హింద్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే బొగ్గు లోడుతో కూడిన రెండు వాహనాలు ఇక్కడ నిలిపి ఉంచారు. అంబాలా నుంచి జమ్మూతావికి వెళ్తున్న సమ్మర్ స్పెషల్ ఫ్యాసింజర్ రైలుపైకి ఒక గూడ్స్ రైలు ఇంజన్ పడిపోయింది. ఈ సమయంలో ఫ్యాసింజర్ రైలులోని ప్రయాణికులు భయంతో పెద్దగా కేకలు వేశారు. అయితే, ప్రమాదవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది. మరోవైపు అంబాలా టూ లూథియానా అప్ లైన్ పూర్తిగా నిలిచిపోయింది. అంబాలా డివిజన్‌ ​​డీఆర్‌ఎంతోపాటు రైల్వే, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సీనియర్‌ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.