Karnataka Clash : కర్ణాటకలో ఈద్ మిలాద్ సందర్భంగా ఘర్షణ…అయిదుగురికి గాయాలు

కర్ణాటక రాష్ట్రంలో ఈద్ మిలాద్ వేడుకల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా రాగిగుడ్డ సమీపంలోని శాంతినగర్ లో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఒక వర్గానికి చెందిన వ్యక్తుల నివాసాలపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది....

Karnataka Clash

Karnataka Clash : కర్ణాటక రాష్ట్రంలో ఈద్ మిలాద్ వేడుకల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు గాయపడ్డారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా రాగిగుడ్డ సమీపంలోని శాంతినగర్ లో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఒక వర్గానికి చెందిన వ్యక్తుల నివాసాలపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. (Karnataka) ఈ ఘర్షణల్లో అయిదుగురు గాయపడ్డారని కర్ణాటక పోలీసులు తెలిపారు. (Two groups clash during Eid-e-Milad celebration)

Nikhat Zareen : ఆసియా బాక్సింగ్ క్రీడల్లో నిఖత్ జరీన్‌కు కాంస్య పతకం…ఎమ్మెల్సీ కవిత అభినందన

అప్రమత్తమైన పోలీసులు ఘర్షణలు జరగకుండా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. నిరసనకారులు పోలీసుల బారికేడ్లను తొలగించడానికి ప్రయత్నించారు. దీంతో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. సమస్య సద్దుమణిగిందని, పరిస్థితి అదుపులో ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) తెలిపారు. ఈ ఘర్షణల్లో అయిదుగురికి స్వల్ప గాయాలయ్యాయని ఎస్పీ ధృవీకరించారు. వదంతులు వ్యాప్తి చేయవద్దని, శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలను ఎస్పీ కోరారు.

ట్రెండింగ్ వార్తలు