Women Officers: సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలు.. సివిల్ సర్వీసెస్ మహిళా అధికారుల బదిలీ
డి.రూపా మౌడ్గిల్ (ఐపీఎస్), రోహిణి సింధూరి (ఐఏఎస్)లను తమ విధుల నుంచి బదిలీ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ అయ్యాయి. వీరిలో రూప భర్త అయిన మునిష్ మౌడ్గిల్ (ఐఏఎస్)ను ప్రభుత్వ ప్రచార విభాగానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Women Officers: ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సివిల్ సర్వీసెస్ మహిళా అధికారులపై కర్ణాటక ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇద్దరినీ బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరినీ బదిలీ చేసిన ప్రభుత్వం వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
Anonymous Donor: చిన్నారికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.11 కోట్లు దానం చేసిన గుర్తు తెలియని వ్యక్తి
డి.రూపా మౌడ్గిల్ (ఐపీఎస్), రోహిణి సింధూరి (ఐఏఎస్)లను తమ విధుల నుంచి బదిలీ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ అయ్యాయి. వీరిలో రూప భర్త అయిన మునిష్ మౌడ్గిల్ (ఐఏఎస్)ను ప్రభుత్వ ప్రచార విభాగానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇంతకుముందు ఆయన రెవెన్యూ విభాగంలో కమిషనర్‌గా ఉండేవారు. రూప, రోహిణి.. ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన వివాదాస్పదమైంది.
ఈ అంశంపై సోమవారం స్పందించిన కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోహిణికి సంబంధించిన ప్రైవేటు ఫొటోలను రూప ఆదివారం తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా రోహిణి గతంలో తన ఫొటోలను సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా మగవాళ్లైన అధికారులకు పంపిందని రూప ఆరోపించింది. ఆమె ఆరోపణలపై రోహిణి స్పందిస్తూ.. ఆమె మానసిక సమస్యల్తో బాధపడుతున్నారని, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తన ప్రైవేటు ఫొటోలు ఇలా పోస్ట్ చేయడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. దీంతో మొదలైన ఇరువురి మధ్య వివాదం అవినీతి ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లింది. ఈ వ్యవహారం సివిల్ సర్వీసెస్ నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్రభుత్వం స్పందించింది. ఇద్దరినీ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.