Prabhjeet Singh : క్యాబ్ డ్రైవర్‌‌గా మారిన సీఈఓ.. ఎందుకో తెలుసా ?

ఆయనతో సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి...కొంతమంది ఆయనేనా ? కాదా ? అనేది తెలుసుకోవడానికి గూగుల్...

Prabhjeet Singh : క్యాబ్ డ్రైవర్‌‌గా మారిన సీఈఓ.. ఎందుకో తెలుసా ?

Cab Driver

Updated On : March 11, 2022 / 7:18 PM IST

Uber India CEO : ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయో తెలుసుకొనేందుకు కొంతమంది మారు వేషంలో వెళుతుంటారు. వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీస్తారు. వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకుని వారు షాక్ కు గురవుతుంటారు. నమ్మశక్యం కావడం లేదని అంటారు. మరికొంతమంది మారు వేషంలో కాకుండా వస్తుంటారు. ఇలాగే… ఓ క్యాబ్ కు సంబంధించిన సీఈఓ చేశారు. వారు బుక్ చేసుకున్న పాయింట్ వద్ద పికప్ చేసి డ్రాప్ చేశారు. తాను ఎవరో చెప్పే సరికి కస్టమర్లు సంభ్రామాశ్చర్యాలకు గురయ్యారు. తమను దింపింది ఏకంగా సీఈఓ అని విషయం తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు.

Uber Cab Driver

Uber Cab Driver

Read More : Uber Bill: 17కిలోమీటర్లకు ట్యాక్సీ బిల్లు చూసి షాకైన కస్టమర్!

ఆయనతో సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆయన ఎవరో కాదు.. ‘ఉబర్ ఇండియా’ సీఈఓ. ఢిల్లీ, గుర్ గ్రామ్ లలో ఉబర్ కు సంబంధించిన క్యాబ్ ల సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోవాలని ఉబెర్ ఇండియా సీఈఓ ప్రభ్ జిత్ సింగ్ భావించారు. స్వయంగా డ్రైవర్ గా మారిపోయారు. క్యాబ్ వేసుకుని ప్రయాణీకులకు సేవలందించారు. తొలుత ఆయన్ను ప్రయాణీకులు అస్సలు గుర్తించలేదు. తాను ఉబర్ ఇండియా చీఫ్ అని చెప్పడంతో కస్టమర్లు ఆశ్చర్యపోయారు.

 

Uber Cab Ceo

Uber CEO

Read More : ఉబర్ కొత్త రూల్ : క్యాబ్ ఎక్కాలంటే మాస్కుతో సెల్ఫీ తీసి పంపాలి

కొంతమంది ఆయనేనా ? కాదా ? అనేది తెలుసుకోవడానికి గూగుల్ ను ఆశ్రయించారు. ఆయనే అని నిర్ధారించుకున్న తర్వాత.. సెల్ఫీ దిగారు. ఈ విషయాన్ని అనన్య ద్వివేది వెల్లడించారు. లింక్డ్ ఇన్ లో పోస్టు చేశారు. తాను ఆఫీసుకు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నట్లు, కొద్ది సేపటి తర్వాత కారు వచ్చిందన్నారు. తాను ఉబర్ ఇండియా సీఈఓ అంటూ క్యాబ్ డ్రైవర్ సీట్లో కూర్చొన్న వ్యక్తి చెప్పాడన్నారు. తొలుత షాక్ కు గురయి…గూగూల్ లో సెర్చ్ చేసినట్లు తెలిపారు. నిజంగా ప్రభ్ జిత్ సింగ్ డ్రైవర్ గా వచ్చి తనను ఆఫీసు వరకు తీసుకెళ్లారని ద్వివేది పోస్టులో రాసుకొచ్చారు. ఉబర్ కస్టమర్లకు అందుతున్న సేవల గురించి తెలుసుకొనేందుకు డ్రైవర్ గా మారినట్లు వెల్లడించారు. ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.