Uber Cab : క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాక లేట్‌గా వచ్చినందుకు రూ.20వేలు జరిమానా

ఓ మహిళ క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాక క్యాబ్ లేట్‌గా వచ్చినందుకు రూ.20,000 జరిమానా విధించింది కోర్టు.

Uber Cab :  క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాక లేట్‌గా వచ్చినందుకు రూ.20వేలు జరిమానా

Uber Ordered To Pay Rs. 20,000 To Mumbai women

Updated On : October 27, 2022 / 2:50 PM IST

Uber Cab :  బుక్ చేసుకున్న క్యాబ్ సమయానికి రాలేదని..ఓ న్యాయవాది సదరు క్యాబ్ డ్రైవర్ పై కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో సదరు క్యాబ్ డ్రైవర్ రూ.20,000లు జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చింది వినియోగదారుల ఫోరం. ఓ న్యాయవాది ఫిర్యాదుమేరకు ముంబయికి చెందిన ఓ వినియోగదారుల ఫోరం ఉబర్‌ ఇండియాపై రూ.20 వేల జరిమానా విధించింది. క్యాబ్‌ బుక్‌ చేసుకున్న వ్యక్తికి ఆలస్యంగా సేవలు అందించిన కారణంగా రూ.20,000 జరిమానాగా కట్టాలని తీర్పు వెలువరించింది. ఇది 2018లో జరుగగా సదరు న్యాయవాదికి అనుకూలంగా తాజాగా తీర్పు వెలువడింది వినియోగదారుల ఫోరం.

ముంబయికి చెందిన కవితా శర్మ అనే న్యాయవాది 2018 జూన్‌ 12న చెన్నైకి వెళ్లాల్సి ఉండగా ముందుగానే విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నారు. ఆమె ఇల్లు విమానాశ్రయాని 36 కి.మీ దూరంలో ఉంది. దీంతో కవితా శర్మ మధ్యాహ్నం 3:29 గంటలకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. కానీ సమయం మించిపోతున్నా బుక్ చేసిన క్యాబ్ రాలేదు. దీంతో ఆమె పదే పదే ఫోన్ చేశారు. అలా చేయగా చేయగా యాప్‌లో చూపించిన దాని కంటే క్యాబ్‌ 14 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆమె ఆదరాబాదగా క్యాబ్ ఎక్కేశారు. అప్పుడైనా క్యాబ్ డ్రైవర్ నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లాలి. కానీ అలా చేయలేదు.సీఎన్‌జీ స్టేషన్‌లో ఆపి మరింత లేట్ చేశాడు. ఆ తరువాత వేరే వేరే రూట్లలోంచి తీసుకెళ్లాడు. తీరా ఆమె ఎయిర్ పోర్టుకు చేరుకునేసరికి విమానం వెళ్లిపోయింది. విమానం మిస్ అవ్వటంతో ఆమె మరో టికెట్‌ కొనుక్కొని తర్వాతి విమానానికి వెళ్లాల్సింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

దీంతో ఆమె తనకు కలిగిన ఈ ఇబ్బందిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. యాప్ లో చూపించినదానికంటే 14 నిమిషాలు లేటుగా రావటమేకాకుండా అదీ మధ్యలో పలుసార్లు డ్రైవర్‌కు కాల్‌ చేయాల్సి వచ్చిందని.. కోర్టుకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రయాణాన్ని మరింత ఆలస్యంచేడని తెలిపారు. అంతేకాకుండా వెళ్లాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్లో తీసుకెళ్లటం..సీఎన్‌జీ స్టేషన్‌లో ఆపి మరింత లేట్ చేయటం ఇలా పలు ఇబ్బందులకు గురిచేస్తు నాకు టెన్షన్ తెప్పించాడని అలా అతను 15-20 నిమిషాలు లేట్ చేయటంతో తాను విమానం మిస్ అయ్యానని దీంతో మరో టికెట్‌ కొనుక్కొని తర్వాతి విమానానికి వెళ్లాల్సి వచ్చిందని కోర్టుకు విన్నవించారు కవితా శర్మ.

అంతేకాదు..క్యాబ్ డ్రైవర్ తనను చాలా టెన్షన్ కు గురి చేశాడని..పైగా యాప్‌లో బుక్‌ చేసుకున్న సమయంలో ట్రిప్‌ ఖరీదు రూ.563 చూపించగా.. చివరకు ఉబర్‌ రూ.703 బిల్లు చేసానని అడ్వకేట్ కవిత తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేయగా.. తర్వాత రూ.139 తిరిగి ఖాతాలోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. కవిత మొదట ఉబర్‌ కంపెనీకి న్యాయపరమైన నోటీసులు పంపారు. కానీ అక్కడినుంచి ఎటువంటి స్పందానా లేదు. దీంతో ఆమె ఠాణె జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. అప్పుడు స్పందించిన ఉబర్‌ తాము కేవలం వినియోగదారులు, డ్రైవర్ల మధ్య అనుసంధానం చేసే వేదిక మాత్రమేనని వివరణ ఇచ్చింది. యాప్‌ను కంపెనీయే నిర్వహిస్తున్న క్రమంలో ఆ వేదికగా జరిగే లావాదేవీలు, సేవలకు బాధ్యత వహించాల్సిందేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. కోర్టు ఖర్చుల కింద రూ.10,000, మానసికంగా వేదనకు గురి చేసినందుకుగానూ మరో రూ.10,000 చెల్లించాల్సిందేనని ఆదేశించింది.