Ukraine – Russia : వంటింట్లో ‘ఆయిల్’ బాంబ్

దీన్ని సాకుగా చూపించి.. ఆయిల్‌ రేటును భారీగా పెంచేశాయి కంపెనీలు. ఈ మధ్యే కాస్త ధర తగ్గిందనుకున్న సమయంలో యుక్రెయిన్ యుద్ధం.. మన వంటిళ్లలో ఆయిల్‌ బాంబ్‌ను వేసింది.

Ukraine – Russia : వంటింట్లో ‘ఆయిల్’ బాంబ్

Sunflower Oil

Updated On : March 2, 2022 / 7:48 AM IST

Ukraine – Russia : యుక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎఫెక్ట్ భారతీయుల వంటింటిపై పడనుంది. ఇప్పటికే అమాంతం పెరిగిన వంటనూనె ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. మన దేశంలో వినియోగించే పొద్దుతిరుగుడు నూనెలో 75 శాతం యుక్రెయిన్‌ నుంచే దిగుమతి అవుతోంది. రష్యా యుక్రెయిన్‌ పైకి దండెత్తడంతో అక్కడి నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఆగిపోయాయి. దీన్ని సాకుగా చూపించి.. ఆయిల్‌ రేటును భారీగా పెంచేశాయి కంపెనీలు. ఈ మధ్యే కాస్త ధర తగ్గిందనుకున్న సమయంలో యుక్రెయిన్ యుద్ధం.. మన వంటిళ్లలో ఆయిల్‌ బాంబ్‌ను వేసింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను అమాంతం పెంచేసింది.

Read More  : Ukrainian : బ్రిటన్ ప్రధానికి షాక్ ఇచ్చిన మహిళా జర్నలిస్టు

తెలంగాణలో నెలకు 50 వేల టన్నుల వంట నూనెలను మార్కెట్లలో విక్రయిస్తుండగా… ఇందులో 20 వేల టన్నుల వరకు సన్‌ ఫ్లవర్ నూనె ఉంటోంది. ఇదంతా యుక్రెయిన్‌ నుంచే దిగుమతి అవుతోంది. గత కొంత కాలంగా సరఫరాకు బ్రేక్ పడటంతో ధరలు అమాంత పెరుగుతున్నాయి. టన్ను పామాయిల్‌ ధర 2021 ఫిబ్రవరిలో వెయ్యి57 డాలర్లు ఉండగా.. ఇప్పుడు వెయ్యి750 డాలర్లకు చేరింది. సన్‌ ఫ్లవర్‌ ఆయిల్ టన్ను ధర వెయ్యి 400 నుంచి వెయ్యి520 డాలర్లకు చేరింది. యుక్రెయిన్, రష్యా యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే దీంతో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశముందంటున్నారు నిపుణులు.