Maharashtra: మహారాష్ట్ర పెట్టుబడులు గుజరాత్‌కు వెళ్లడంపై విమర్శలు.. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ కీలక ప్రకటన
ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, సోలార్ ఫోటోవోల్టాయిక్స్ తయారీ, ఈ-మొబిలిటీ ఉత్పత్తులు/భాగాలు మొదలైన యూనిట్లను కలిగి ఉంటుందట. ప్రస్తుతం 297.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 482.85 కోట్లకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 207.98 కోట్ల రూపాయలను ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Under Fire For Losing Projects To Gujarat, Maharashtra's Big Announcement
Maharashtra: మహారాష్ట్రకు వచ్చిన పెట్టుబడులు గుజరాత్‌కు మళ్లుతుండడంపై షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రాజెక్టులను వరుసగా ఒదులుకుంటోంది మహా ప్రభుత్వం. అయితే విపక్షాలు సహా ప్రజల నుంచి వచ్చే విమర్శలకు సమాధానం చెప్పలేని సంకటంలో పడ్డ ప్రభుత్వానికి తాజాగా ఓ ప్రకటన ఊరటగా లభించింది. ఇప్పటి వరకు వచ్చిన విమర్శలను తిప్పి కొట్టి, కేంద్ర ప్రభుత్వాన్ని సైతం విమర్శల భారి నుంచి తప్పించేందుకు ఓ కీలక ప్రకటన చేశారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.
రాష్ట్రంలోని పూణెలో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, తొందరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పూణె జిల్లాలోని రంజంగాన్లో ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్’ అనే ఇమేజ్ షేర్ చేస్తూ ‘‘డియర్ మహారాష్ట్ర, ఇదొకసారి చూడండి. పూణె జిల్లాలోని రంజంగాన్లో ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నేను కృతజ్ణతలు తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. చివరిలో మహారాష్ట్ర, ఇన్వెస్ట్మెంట్ అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లు షేర్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, సోలార్ ఫోటోవోల్టాయిక్స్ తయారీ, ఈ-మొబిలిటీ ఉత్పత్తులు/భాగాలు మొదలైన యూనిట్లను కలిగి ఉంటుందట. ప్రస్తుతం 297.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 482.85 కోట్లకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 207.98 కోట్ల రూపాయలను ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
CM Power Star : వైసీపీకి షాక్ ఇచ్చిన విద్యార్థులు.. వైసీపీ ర్యాలీలో సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు