CM Power Star : వైసీపీకి షాక్ ఇచ్చిన విద్యార్థులు.. వైసీపీ ర్యాలీలో సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు

విశాఖ జిల్లా చోడవరంలో వైసీపీ నేతలకు విద్యార్థులు షాక్ ఇచ్చారు. వైసీపీ ర్యాలీలో జనసేనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

CM Power Star : వైసీపీకి షాక్ ఇచ్చిన విద్యార్థులు.. వైసీపీ ర్యాలీలో సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు

CM Power Star : విశాఖ జిల్లా చోడవరంలో వైసీపీ నేతలకు విద్యార్థులు షాక్ ఇచ్చారు. వైసీపీ ర్యాలీలో జనసేనకు అనుకూలంగా నినాదాలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి భేరి నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో విద్యార్థులను సమీకరించారు. అయితే ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేయడంతో వైసీపీ నేతలు కంగుతిన్నారు.

వికేంద్రీకరణకు మద్దతుగా శివాలయం నుంచి జూనియర్ కాలేజీ వరకు భారీ ఎత్తున విద్యార్థులతో విద్యార్థి భేరి నిర్వహించారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఈ ర్యాలీ జరుగుతున్న క్రమంలో అటుగా జనసేన నేతలు వచ్చారు. దీంతో విద్యార్థులంతా పవర్ స్టార్ సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముందుగా ర్యాలీలో చివర్లో ఉన్న విద్యార్థులు నినాదాలు చేశారు. ఆ తర్వాత ముందున్న విద్యార్థులు కూడా నినాదాలు అందుకున్నారు. దీంతో అక్కడే ఉన్న వైసీపీ నేతలు కంగుతిన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత తేరుకున్న నాయకులు.. విద్యార్థులను నిలవరించే ప్రయత్నం చేశారు. అయినా విద్యార్థులు వినలేదు. మరింత గట్టిగా జనసేనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

దీనిపై జనసేన నేతలు కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. కాగా, ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సహా వైసీపీ నాయకులు లైట్ తీసుకున్నారు. వారంతా విద్యార్థులు, వాళ్లపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అందుకే ఇలా నినాదాలు చేసి ఉంటారని భావించారు.