Underprivileged Children : పేరుకే పేదింటి యువతులు.. ప్రతిభలో వీరికి వీరే సాటి.. ఫ్యాషన్‌ ప్రపంచాన్నే ఊపేశారుగా..!

Underprivileged Children : సబ్యసాచి లగ్జరీ డిజైన్‌ల నుంచి ప్రేరణ పొందిన ఈ యువ కళాకారులు ఆయన క్రియేషన్‌లను రీక్రియేట్ చేయడమే కాకుండా దానంగా ఇచ్చిన దుస్తులను అద్భుతమైన పెళ్లి వస్త్రాలుగా రూపొందించి అందరిని అబ్బురపరిచారు.

Underprivileged Children

Underprivileged Children : సెలబ్రిటీ ప్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ అంటే.. భారతీయ పెళ్లి ఫ్యాషన్‌కి పరిచయం అక్కర్లేని పేరు. భారతీయ వారసత్వానికి ప్రతిబింబించేలా అద్భుతమైన పెళ్లి దుస్తుల డిజైన్‌లు ప్రపంచవ్యాప్తంగా వధువులను, ఫ్యాషన్ ఔత్సాహికులను అమితంగా ఆకర్షించాయి.

ప్రత్యేకమైన డిజైన్‌తో మోడలింగ్ వంటి దుస్తులను సబ్యసాచి భారతీయ పెళ్లి దుస్తులకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. ప్యాషన్ డిజైనర్ సబ్యసాచి ప్రేరణతో అత్యంత అందమైన బ్రైడల్ డిజైనర్ దుస్తులను తయారు చేశారు లక్నోకు చెందిన నిరుపేద యువతలు. డిజైనర్ ఐకానిక్ బ్రైడల్ వేర్‌లను రీక్రియేట్ చేయడం నెటిజన్లను ఎంతో ఆకర్షించింది.

సబ్యసాచి లగ్జరీ డిజైన్‌ల నుంచి ప్రేరణ పొందిన ఈ యువ కళాకారులు ఆయన క్రియేషన్‌లను రీక్రియేట్ చేయడమే కాకుండా తమకు దానంగా ఇచ్చిన దుస్తులను అద్భుతమైన పెళ్లి వస్త్రాలుగా రూపొందించి అందరిని అబ్బురపరిచారు. ఇన్నోవేషన్ ఫర్ చేంజ్ అనే ఎన్జీఓ షేర్ చేసిన వీడియోలో నిరుపేద యువతులు కిరణ్ బార్డర్‌తో డిజైనర్ కలెక్షన్ చూడవచ్చు. ఇది మాత్రమే కాదు.. ప్రసిద్ధ మోడల్స్ ఐకానిక్ వాక్‌తో అందరిని కదిలించారు. యువ కళాకారులు స్టైలిష్ గ్లేర్‌తో బ్రైడల్ వేర్‌లో ఎలా పోజులిచ్చారో వీడియోలో చూడవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోపై ఎన్జీఓ వివరిస్తూ.. “మేం లక్నోకు చెందిన ఎన్జీఓ, 400+ మురికివాడల పిల్లలతో పని చేస్తున్నాం. ఈ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం. ఈ డ్రెస్‌లను మా విద్యార్థులు డిజైన్ చేశారు. ఇందులో ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులందరూ మురికివాడల ప్రాంతాలకు చెందిన వారే. ఈ పిల్లలు చాలా పేద, నిస్సహాయ కుటుంబాల నుంచి వచ్చారు. వారు తమ క్రియేటివిటీ ద్వారా డిజైనర్ దుస్తులను రూపొందించేందుకు ప్రయత్నించారు. స్థానికులు, చుట్టుపక్కల వ్యక్తుల నుంచి దానంగా పొందిన అన్ని దుస్తులను స్వచ్ఛందంగా రీడిజైన్ చేశారు’’ అని పేర్కొంది.

“ఇటీవల ష్యాషన్ డిజైనర్ కొత్త డిజైన్ వీడియో చూసిన తర్వాత ఇలాంటిదే చేయాలని నిర్ణయించుకున్నారు. మీరు రీల్‌లో చూసే అమ్మాయిలు ప్రొఫెషనల్ మోడల్స్ కాదు. కానీ, మాలిన్ బస్తీలో నివసించే 12 ఏళ్ల నుంచి 17 ఏళ్ల అమ్మాయిలు. అన్ని దుస్తులు ఈ పిల్లలు తయారు చేశారు. దయచేసి అందరికీ మీ ప్రేమను పంచండి. వారి వీడియోను @sabyasachiofficial ద్వారా షేర్ చేయడం మా పిల్లలకు ఒక కల ”అని ఎన్జీఓ పేర్కొంది.


ఈ వీడియోను 15 ఏళ్ల ఔత్సాహిక వీడియో గ్రాఫర్స్‌ రూపొందించారని కూడా ఎన్జీఓ వెల్లడించింది. వైరల్ అయ్యే ఈ వీడియోను 1.7 మిలియన్లకు పైగా వ్యూస్, కామెంట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. ఈ వీడియో సబ్యసాచి ముఖర్జీ దృష్టిని కూడా ఆకర్షించింది. అంతేకాదు, ప్రముఖ డిజైనర్ తన సొంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వీడియోను రీషేర్ చేస్తూ ప్రశంసలు కురిపించారు.

Read Also : PepsiCo, Unilever Products : ఇండియన్స్ అంటే చిన్నచూపా? పెప్సీ-యూనీలివర్ నాసిరకం ఉత్పత్తులపై సంచలన నివేదిక..!