Kashmir Mosque : కశ్మీర్ లో మసీదులో ముస్లింలతో జై శ్రీరాం నినాదాలు!

రాష్ట్రీయ రైఫిల్ జవాన్ల బృందం 10 మంది యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.

Kashmir Mosque : కశ్మీర్ లో మసీదులో ముస్లింలతో జై శ్రీరాం నినాదాలు!

Kashmir mosque (1)

Mosque Jai Shri Ram Slogans : కశ్మీర్ లో కొంతమంది గుర్తు తెలియని ఆర్మీ జవాన్లు మసీదులోని ముస్లింలతో జై శ్రీరాం నినాదాలు చేయించారు. పూల్వామా జిల్లాలోని జదూరాలోని ఓ మసీదులో ఆర్మీ జవాన్లు గ్రామస్థులతో బలవంతంగా జై శ్రీరాం నినాదాలు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కశ్మీర్ పర్యటన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.

Ghatkesar Youth Kidnap : ఘట్ కేసర్ యువకుడి కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్టు

రాష్ట్రీయ రైఫిల్ జవాన్ల బృందం 10 మంది యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. మసీదులోకి వచ్చిన జవాన్లు బెదిరించి జై శ్రీరాం నినాదాలు చేయించారని ఆరోపించారు. మాజీ సీఎంలు మోహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.