నేడు కేంద్ర క్యాబినెట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు?

కేంద్ర క్యాబినెట్ ఆమోదం తరువాత పార్లమెంటు ముందుకు ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు రానుంది.

Union Cabinet meeting

కేంద్ర క్యాబినెట్ ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనలో కేంద్ర న్యాయ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. జమిలి బిల్లు నేటి కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వస్తుందని తెలుస్తోంది.

లేదంటే వచ్చే బుధవారం క్యాబినెట్ ముందుకు సంబంధిత ముసాయిదా బిల్లు వస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తరువాత పార్లమెంటు ముందుకు ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు రానుంది. ఒకే దేశం-ఒకే ఎన్నికకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు గతంలోనే ఆమోద ముద్ర వేసింది కేంద్ర క్యాబినెట్.

కోవింద్ నివేదిక ఆధారంగా రూపొందుతోంది జమిలి ఎన్నికల బిల్లు. బిల్లుపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని అంచనా వేస్తోంది బీజేపీ నాయకత్వం. పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యాబలం ఉంది. మొత్తం 47 పార్టీల్లో జమిలికి 32 పార్టీలు ఓకే చెబుతున్నాయి. వ్యతిరేకించింది కేవలం 13 పార్టీలు మాత్రమే.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వెనుక మతలబేంటి? శిక్షణ తరగతులకు విపక్ష ఎమ్మెల్యేలు వస్తారా?