Women Reservation Bill : ఈరోజు లోక్‌సభకు మహిళా రిజర్వేషన్ బిల్లు .. రేపు చర్చ

ప్రధాని నరేంద్ర మోదీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు విముక్తి కల్పించనుందా...?మహిళలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న మహిళా బిల్లుకు ఇక ఆమోదం పొందనుందా..? ఈ బిల్లు ఆమోదంతో ఇక మహిళా సాధికారత కలుగనుందా..? అంటే నిజమేననే ఆశాభావం వ్యక్తమవుతోంది.

woman resarvation bill

Women Reservation Bill : ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill )కు ఇక విముక్తి కలుగనుందా..? ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చేయలేని ఈ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విముక్తి కల్పించనుందా…మహిళలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న మహిళా బిల్లుకు ఇక ఆమోదం పొందనుందా..? ఈ బిల్లు ఆమోదంతో ఇక మహిళా సాధికారత కలుగనుందా..? అంటే నిజమేననే ఆశాభావం వ్యక్తమవుతోంది. తాజాగా ప్రధాని మోదీ కేబినెట్ (PM Narendra modi cabinet)ఈ మహిళా బిల్లుకు ఆమోదం పలకటం..దాన్ని కొత్త ప్రారంభమైన పార్లమెంట్ భవనం సమావేశాల్లో ప్రవేశపెట్టటం వంటి కీలక పరిణామాలు ఇక మహిళా బిల్లుకు విముక్తి కలుగనుందనే ఆశలు చిగురించేలా చేస్తున్నాయి.

ఈరోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనం(New Parliament Building)లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో ప్రతిష్టాత్మకమైన మహిళా బిల్లును మంగళవారం (సెప్టెంబర్ 19,2023) మధ్యాహ్నాం లోక్ సభ(Lok Sabha,)కు ఈ బిల్లు ఎంట్రీ ఇవ్వనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ (Law Minister Arjun Ram )మహిళా బిల్లును లోక్ సభలో ఈరోజు మధ్యాహ్నాం ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ప్రవేశ పెట్టాక దీనిపై చర్చను రేపు కొనసాగించనున్నారు. అలాగే మహిళా బిల్లును గురువారం రాజ్యసభ(Rajya sabha)లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.

Pawan Kalyan : మహిళా రిజర్వేషన్ బిల్లుపై పవన్ కల్యాణ్ రియాక్షన్

ఎంతోకాలంలో పెండింగ్ లోనే మగ్గిపోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలపటంతో దేశవ్యాప్తంగా మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక పార్లమెంట్ సభల్లో మహిళ ప్రాతినిథ్యం పెరగనుంది. ప్రస్తుతం లోక్ సభలో మహిళా సభ్యుల వాటా 14.94 శాతం. రాజ్యసభలో వారి ప్రాతినిధ్యం 14.05 శాతంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో కేవలం ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 19 రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రస్తుతం మహిళా ప్రతినిధుల వాటా 10శాతం లోపే ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో మొదటిసారి 1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. 2008లో రాజ్యసభలో మరోసారి బిల్లును ప్రవేశపెట్టగా.. 2010లో ఆమోదం పొందింది. కానీ లోక్ సభలో దాదాపు కొన్నేళ్లపాటు దాన్ని పక్కన పెట్టడంతో వీగిపోయింది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ బిల్లుపు సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు