“Hooligans Not Farmers” : రైతులకు క్షమాపణ చెప్పిన కేంద్రమంత్రి మీనాక్షి లేఖి

ఆందోళన పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడేవారు రైతులు కాదు పోకిరీలు, ఆకతాయిలు అంటూ వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి రైతులకు క్షమాపణ చెప్పారు.

“Hooligans Not Farmers” : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన సందర్భంగా రైతులు తమ నిరసనలకు కొనసాగిస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో ప్రముఖ మీడియా ఛానల్‌కు చెందిన సీనియర్ వీడియో జర్నలిస్టుపై దాడి జరిగింది. దీనిపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మీనాక్షి లేఖి రైతులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు..‘‘వాళ్లు రైతులు కాదు హూలిగాన్స్ (ఆకతాయిలు..పోకిరీలు)దుష్టులు అంటూ వ్యాఖ్యానించారు.

వ్యవసాయం చేయటం మానేసి రోడ్లపై ఆందోళన చేసే వారిని రైతులు అని ఎలా అంటాం? ఆందోళన పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నవారిని రైతులు అని పిలవకూడదు..కుట్రదారులతో చుతులు కలిపి ఆటలాడుతున్నారు..ఇటువంటివారిని రైతులు అనకూడదు..నిజమైన రైతులు వారి పంటపొలాల్లో వ్యవసాయం చేస్తుంటారు..ఇటువంటి పనులు చేయరని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావటంతో ఆమె రైతులకు క్షమాపణ చెప్పారు. నా వ్యాఖ్యలను వక్రీకరించారని..నేను కేవలం హూలిగాన్స్ అని మాత్రమే అన్నానని..అంతకుమించి ఏమీ అనలేదని సమర్ధించుకున్నారు.నా మాటలు వక్రీకరించబడ్డాయి. ఇది రైతులను గానీ మరి ఎవరినైనా గానీ బాధపెట్టి ఉంటే..క్షమాఫణ కోరుతున్నానని తెలిపారు. నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానంటూ వివరణ ఇచ్చారు మంత్రి మీనాక్షి లేఖి.

కాగా..రైతుల ఆందోళనలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న క్రమంలో రైతుల ఆందోళనలో కొన్ని అసాంఘీక శక్తులు కూడా కలిసి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారనీ గతంలో రైతులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వీడియో జర్నలిస్టుపై దాడి జరిగింది.

రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి నన్ను లైట్ స్టాండ్ తో తలపై కొట్టాడు. అలా మూడుసార్లు నా తలపై కొట్టాడు. ఆ వ్యక్తి కిసాన్ మీడియా అని ఐడి కలిగి ఉన్నాడు. నేను. అతను రైతు కాదా అని నాకు తెలియదు..అని నిరసనల్లో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీడియో జర్నలిస్ట్ తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు