Piyush Goyal : ముడి బియ్యం ఎంతిచ్చినా కొనేందుకు సిద్ధం – పీయూష్ గోయల్
ఒప్పందం ప్రకారం కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రైతులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు.

Tg Paddy
Piyush Goyal : దేశంలో ఉప్పుడు బియ్యం ఇప్పుడు ఎవరు తినడం లేదు.. ఏడాది కిందటే ముడి బియ్యం సప్లై చేయాలని తెలంగాణను కోరినట్లు…ముడి బియ్యం ఎంత ఇచ్చినా కొనేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని.తనపై, మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ పూల్ కింద ఇవ్వాల్సిన ముడి బియ్యం ఇవ్వాలన్నారు. నాలుగు ఏళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ నిల్వలు ఎఫ్ సీఐ (FCI) వద్ద ఉన్నాయన్నారు. 2021, డిసెంబర్ 21వ తేదీ మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో వారు ఆయనతో చర్చించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ…
Read More : Marriage Bill : వివాహ వయసు సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన స్మృతి ఇరానీ
ఓటమి తర్వాత తెలంగాణ సీఎం కెసిఆర్ నిస్పృహలో ఉన్నారని ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు లేని సమస్యను సృష్టించారని విమర్శించారు. తెలంగాణ నుంచి గతం కంటే మూడు రేట్లు ఎక్కువ ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. మద్దతు ధర అయిదు సార్లు పెంచామనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, గత రబీ సీజన్ లో రావాల్సిన 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పటి వరకు సప్లయి చేయలేదన్నారు. ప్రత్యేక కేసు కింద తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం సేకరణకు కొంత వెసులుబాటు ఇచ్చినట్లు చెప్పారు.
Read More : Telangana Paddy Issue : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఫైర్
రబీ కింద ఇవ్వాల్సిన 14 ఎల్ఎంటీ ఉప్పుడు బియ్యం, 13 ఎల్ఎంటీ ముడి బియ్యం వెంటనే సప్లయి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రైతులకు కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వచ్చే యాసంగిలో ముడి బియ్యం పంపుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా..ఢిల్లీకి టీఆర్ఎస్ మంత్రులు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ పంపమని లేఖ రాసినట్లు, ఒప్పందం ప్రకారం కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రైతులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు.