కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా

  • Published By: venkaiahnaidu ,Published On : October 28, 2020 / 08:57 PM IST
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా

Updated On : October 28, 2020 / 9:19 PM IST

Smriti Irani tests positive for coronavirus కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని బుధవారం(అక్టోబర్-28,2020)ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను దగ్గరిగా కలిసినవారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆమె కోరారు.



కాగా,బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్మృతీ ఇరానీ యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. బీహార్ లో పలు ర్యాలీల్లో ఆమె పాల్గొన్నారు. అయితే,బీహార్ ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో కరోనా బారినపడిన ఐదవ బీజేపీ లీడర్ గా స్మృతీ ఇరానీ నిలిచారు. గత శనివారం బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జి,మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్రఫడ్నవీస్ కూడా తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించిన విషయం తెలిసిందే.



మరోవైపు, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ కూడా ఇటీవల కరోనా బారినపడ్డారు. బీహార్ లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న మాజీ మంత్రి షహనావాజ్ హుస్సేన్,ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ కూడా బీహార్ ఎన్నికల ప్రచార సమయంలో కరోనా బారినపడ్డారు.