UP CM Kalyan Singh: విషమంగా మాజీ సీఎం, మాజీ గవర్నర్ ఆరోగ్యం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ హెల్త్ కండిషన్ ప్రమాదకరంగా మారింది. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనలో ఎటువంటి మార్పు కనిపించడం లేదని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం వెల్లడించింది.

UP CM Kalyan Singh: విషమంగా మాజీ సీఎం, మాజీ గవర్నర్ ఆరోగ్యం

Up Cm

Updated On : July 24, 2021 / 3:11 PM IST

UP CM Kalyan Singh: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ హెల్త్ కండిషన్ ప్రమాదకరంగా మారింది. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనలో ఎటువంటి మార్పు కనిపించడం లేదని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం వెల్లడించింది. సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో క్లోజ్ మానిటరింగ్ లో ఉండగా కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోక్రినోలజీ డిపార్ట్‌మెంట్లు పర్యవేక్షణలో ఉన్నారు.

యూపీ మాజీ సీఎం, రాజస్థాన్ మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం దెబ్బతినడంతో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ జరుగుతుంది. హెల్త్ కండీషన్ లో ఎటువంటి మార్పు లేదని హాస్పిటల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్ నేతృత్వంలో ట్రీట్మెంట్ జరుగుతుంది.

89సంవత్సరాల మాజీ సీఎం.. జులై 4న ఇన్ఫెక్షన్ సోకి అపస్మారక స్థితిలో చేరుకోవడంతో హాస్పిటల్ లో చేరారు. అంతకంటే ముందు రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.