సైకిల్ పై వెళ్లి విద్యుత్ బకాయిలు అడిగిన మంత్రి..వెంటనే చెల్లించిన ప్రజలు

UP Minister cycles ride to work for green cause : ప్రజలకు ఆదర్శంగా నిలవాలి ప్రజాప్రతినిధులు. కానీ ఎంతమంది అలా ఉన్నారు? అంటే ఆలోచించాల్సిన విషయమే. పర్యావరణాన్ని పరిరక్షించండీ అని ఎమ్మెల్యేలు..మంత్రులు పిలుపులు ఇస్తుంటారు. కానీ వాల్లు మాత్రం కాలుష్యాన్ని వెదజల్లే కార్లల్లో తిరుగుతుంటారు. మంత్రులైతే వారి కారుతోపాటు వారి సిబ్బంది కూడా కార్లల్లోనే తిరుగుతుంటారు.పైగా కాలుష్యాన్ని తగ్గించండీ అంటూ పిలుపులిస్తుంటారు. ఇది ప్రజలు ఇచ్చే సందేశాలు ఇలాగేనా? అనే ప్రశ్న కూడా వస్తుంది.
కానీ ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ సైకిల్ మీద తిరుగుతూ అందరికీ ఆకట్టుకున్నారు. అంతేకాదు ఆయన శాఖకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని ప్రజల వద్దకు వెళ్లి మరీ అడిగారు. దీంతో స్వయంగా మంత్రిగారే వచ్చి అడిగితే ప్రజలు కాదంటారా చెప్పండీ..వెంటనే తమకు ఉండే విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించేశారు ప్రజలు.
వివరాల్లోకి వెళితే..ఉత్తర్ ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ పర్యావరణ కాలుష్యం తగ్గించాలంటే సైకిల్ ను ఎక్కువగా వాడండీ అని సందేశంతో తన నివాసం నుంచి ఆఫీసుకు సైకిల్ తొక్కకుంటూ వెళ్లారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణను గురించిన అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు.
యూపీలోని బంగ్లా బజార్, ఆషియానా ప్రాంతాల్లోని విద్యుత్ సబ్‌సెంటర్లకు కూడా ఆయన సైకిల్ తొక్కుకుంటూనే వెళ్లి అక్కడ అధికారులతో చర్చలు జరిపి పనితీరును తెలుసుకున్నారు.అలాగే పలువురు వినియోగదారులను స్వయంగా కలసారు..మీకు విద్యుత్ సరిగ్గా అందుతోందా? కోతలేమన్నా ఉన్నాయా? అంటూ పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ బకాయిలు ఏమన్నా ఉంటేవెంటనే చెల్లించండి అని విజ్ఞప్తి చేయగా వెంటనే స్థానికులు వారికున్న విద్యుత్ బకాయిల్ని చెల్లించేశారు.
స్వయంగా మంత్రిగానే స్వయంగానే వచ్చి అడిగితే ప్రజలు కట్టకుండా ఉంటారా మరి..మంత్రిగారు అగడిగిందే తడవుగా వినియోగదారులు పెద్ద సంఖ్యలో అక్కడికక్కడే బిల్లులు చెల్లించేశారు. దీంతో మంత్రి శ్రీకాంత్ శర్మ వారిని అభినందించారు. ఇకపై బకాయిలు ఉంచుకోవద్దనీ..వెంటనే చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.