Viral Video: స్కూల్ నుంచి సైకిల్‌పై వెళ్తున్న అమ్మాయి చున్నీని లాగిన యువకులు.. విద్యార్థిని మృతి

దీంతో వారిపై తాము కాల్పులు జరిపామని వివరించారు. ఆ ముగ్గురు నిందితులకు..

UP Girl Falls Off Cycle

Viral Video – UP Girl: ఓ అమ్మాయి స్కూల్ నుంచి సైకిల్‌పై ఇంటికి వెళుతోంది. ఇంతలో యువకులు బైక్‌పై వచ్చి ఆ అమ్మాయి చున్నీని లాగి దూసుకుపోయారు. దీంతో ఆ అమ్మాయి రోడ్డుపై కింద పడిపోయింది. వెనుక నుంచి వచ్చిన మరో బైకు ఒక్కసారిగా ఆ అమ్మాయిని ఢీ కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ జిల్లా, హీరాపూర్ మార్కెట్ కు సమీపంలో చోటుచేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన ఆ అమ్మాయి వయసు 17 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. సైకిల్ పై నుంచి ఆ విద్యార్థిని పడిపోయిన తర్వాత దురదృష్టవశాత్తూ ఆమెపై నుంచి ఒక్కసారిగా మరో బైకు వెళ్లడంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయని వివరించారు.

అమ్మాయిని వేధింపులకు గురిచేస్తూ, చున్నీ లాగిన నిందితులు ఫైజల్, షాబాజ్, అర్బాజ్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారు ముగ్గురినీ వైద్య పరీక్షలకు తరలించిన వేళ పోలీసుల రైఫిల్ లాక్కొని, పారిపోయేందుకు ప్రయత్నించారని అన్నారు. దీంతో వారిపై తాము కాల్పులు జరిపామని వివరించారు. ఆ ముగ్గురు నిందితులకు గాయాలయ్యాయని తెలిపారు.

AP Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైంది.. ఏమాత్రం అవినీతి, మనీలాండరింగ్ జరగలేదు