సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు తమ సత్తా చూపించేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఈరోజు(జనవరి 19, 2019) కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న యునైటెడ్ ఇండియా ర్యాలీకి వివిధ రాష్ట్రాల నుంచి ఎన్డీయే, మోడీని వ్యతిరేకించే నాయకులందరూ హాజరయ్యారు.ఈ సందర్భంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికలు దేశానికి రెండవ స్వాతంత్ర పోరాటం లాంటివని అన్నారు.
వెస్ట్ బెంగాల్ ఈ రోజు ఆలిచిందిదని, దేశం రేపు ఆలోచిస్తుందని ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి అన్నారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా దేశం తీవ్ర సంక్షోభంలో ఉందని గుజరాత్ ఎమ్మెల్యే జిఘ్నేష్ మేవాని అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ ను ఓడించడానికి అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు. ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాల హక్కులు కాపాడగలవని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. మమతాబెనర్జీల వినయంగా ఉండాలని తన తండ్రి దేవెగౌడ ఎప్పుడూ తనకు చెబుతుండేవారిని కుమారస్వామి తెలిపారు. మమతా పశ్చిమబెంగాల్ ను అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తోందన్నారు.