Modi Calls Urban Naxals: అర్బన్ నక్సలైట్ల అంశాన్ని మరోసారి లేవనెత్తి కాంగ్రెస్‭పై విమర్శలు గుప్పించిన మోదీ

కాంగ్రెస్ నేతలకు పేద రైతు పొలం ఫోటో సెషన్ గ్రౌండ్ అయితే, బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని గ్రాండ్‌గా మారుస్తూ ప్రపంచానికి అదే చిత్రాన్ని చూపుతోంది. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఇదే

Modi Calls Urban Naxals: అర్బన్ నక్సలైట్ల అంశాన్ని మరోసారి లేవనెత్తి కాంగ్రెస్‭పై విమర్శలు గుప్పించిన మోదీ

Modi Calls Congress as Urban Naxals: కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సలైట్లు నడిపిస్తున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీని మొదట నాశనం చేసి, ఆ తర్వాత దివాళా తీసి, ఇప్పుడు పార్టీని నడిపే కాంట్రాక్టును అర్బన్ నక్సలైట్లకు అప్పగించారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో అర్బన్ నక్సలైట్లు మాత్రమే నడుస్తున్నారని మోదీ అన్నారు. సోమవారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్‌లో నిర్వహించిన ‘కార్యక మహాకుంభ్’లో మోదీ పాల్గొని ప్రసంగించారు.

‘‘కాంగ్రెస్ నేతలకు పేద రైతు పొలం ఫోటో సెషన్ గ్రౌండ్ అయితే, బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని గ్రాండ్‌గా మారుస్తూ ప్రపంచానికి అదే చిత్రాన్ని చూపుతోంది. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఇదే. కాంగ్రెస్, దాని కూటమి నారీ శక్తి వందన్ చట్టానికి మద్దతు ఇవ్వవలసి వచ్చింది. నేను ఇచ్చే హామీలు, బీజేపీ ఇచ్చే హామీలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయి. నవ భారతం ఏం చేసినా, ఎంత పెద్ద ఘనకార్యం సాధించినా కాంగ్రెస్ పార్టీకి అస్సలు నచ్చదు. కాంగ్రెస్ హయాంలో మధ్యప్రదేశ్‌ను యువతను జబ్బుకు గురి చేశారు. బీజేపీ హయాంలో కొత్త శక్తితో రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేసింది’’ అని ప్రధాని మోదీ అన్నారు.

Pawan Kalyan Varahi Yatra: పవన్ నాల్గో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు.. టీడీపీతో పొత్తు ప్రకటన తరువాత తొలిసారి ప్రజల్లోకి

కాంగ్రెస్ పార్టీ తుప్పుపట్టిన ఇనుమని, ఆ పార్టీకి భవిష్యత్ లేదని ప్రధాని మోదీ విమర్శించారు. కేవలం గాంధీ కుటుంబం, ఆ కుటుంబ ప్రయోజనాలు తప్పితే కాంగ్రెస్ పార్టీకి మరేమీ పట్టదని, 60 ఏళ్లపాటు దేశంలో అవినీతి పాలన చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో పేదలు పెరిగితే, తమ హయాంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని మోదీ అన్నారు.