Urea Prices Crash: యూరియా ధరలపై రైతులకు బ్రేకింగ్ న్యూస్..
Urea Prices Drop: ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతులకు శుభవార్త. యూరియా ధరలు తగ్గబోతున్నాయి. భారత్ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన యూరియా దిగుమతి టెండర్లో వచ్చిన ధరలు.
Urea Import Prices Drop Before Kharif Season Relief for Farmers
Urea Prices: ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతులకు శుభవార్త. యూరియా ధరలు తగ్గబోతున్నాయి. భారత్ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన యూరియా దిగుమతి టెండర్లో వచ్చిన ధరలు, కొన్ని వారాల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణం చైనా నుంచి యూరియా సరఫరాలు మళ్లీ పెరగడం.
కొన్ని నెలల క్రితం పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, సరఫరా సమస్యల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అప్పట్లో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (IPL) నిర్వహించిన టెండర్లో టన్ను యూరియా ధర 935 నుంచి 959 డాలర్ల వరకు వెళ్లింది. ఇప్పుడు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) నిర్వహించిన కొత్త టెండర్లో పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపిస్తోంది.
*Mamata Banerjee: మమత అస్త్రసన్యాసం.. కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం?
చైనా ఎగుమతులపై ఉన్న పరిమితులను సడలించడంతో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలపై ఒత్తిడి తగ్గింది. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 11.17 మిలియన్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంది. ఇందులో చైనా నుంచే 2.23 మిలియన్ టన్నులు వచ్చాయి. అంటే భారత యూరియా అవసరాల్లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది.
యూరియా ధరలు తగ్గితే రైతులకు నేరుగా లాభం కనిపించకపోయినా, కేంద్ర ప్రభుత్వంపై పడే ఎరువుల సబ్సిడీ భారం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రైతులకు యూరియా సంచిని తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది.
అయితే ప్రభుత్వం ఇంకా అప్రమత్తంగానే ఉంది. ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత రాకుండా పెద్ద ఎత్తున దిగుమతులు చేసేందుకు చర్యలు కొనసాగిస్తోంది. ఇటీవలే లక్షల టన్నుల యూరియా దిగుమతికి మరో టెండర్ కూడా విడుదల చేసింది.
సింపుల్‌గా చెప్పాలంటే కొద్ది వారాల క్రితం యూరియా ధరలు ఆకాశాన్నంటగా, ఇప్పుడు చైనా సరఫరాలు పెరగడంతో ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. దీంతో ప్రభుత్వ సబ్సిడీ భారం తగ్గే అవకాశం ఉండగా, రైతులకు యూరియా అందుబాటు కూడా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.
