Venezuela Earthquakes: లక్షకు చేరనున్న మృతుల సంఖ్య.. వెనెజువెలాలో భూకంప భీభత్సం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు!
దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలా(Venezuela Earthquakes)లో నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.
US Geological Survey stated that the death toll from the earthquakes in Venezuela has reached one lakh
- వెనెజువెలాలో జంట భూకంపాల భీభత్సం.
- దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.
- వేలాది మంది మరణించే ప్రమాదం.
Venezuela Earthquakes: దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి దేశ రాజధాని కారకాస్‌లోని పలు బహుళ అంతస్తుల భవనాలు, నివాస సముదాయాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద అనేకమంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ విపత్తుపై యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో మరిన్ని బలమైన ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లవచ్చని హెచ్చరించింది. తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది.
Bengaluru Triple Murder: అమ్మవళ్లే నా జీవితం నాశనం.. అందుకే చంపేశా.. కూతురు శ్వేతా సంచలన కామెంట్స్
ప్రభుత్వం అప్రమత్తత.. ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు:
ప్రస్తుతానికి వెనెజువెలా(Venezuela Earthquakes) ప్రభుత్వం మృతుల అధికారిక సంఖ్యను ప్రకటించనప్పటికీ, గాయపడిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోందని స్థానిక అధికారులు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలందరూ వెంటనే ఇళ్లను వదిలి బయటకు వచ్చేయాలని ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. మరింత ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా భవనాలకు సరఫరా అయ్యే పెట్రోల్, గ్యాస్ కనెక్షన్లను నిలిపివేసింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి.
జాతీయ సెలవుదినం నాడే దారుణం.. అత్యవసర పరిస్థితి విధింపు:
జూన్ 24 వెనెజువెలాలో జాతీయ సెలవుదినం కావడంతో ఎక్కువ మంది ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. సెలవు రోజు కావడం వల్లే ప్రాణనష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రధాన భూకంపాల తర్వాత మరో 20 సార్లు భూమి కంపించడంతో ఆమె దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. కాగా, భూకంపం ధాటికి మెక్వెషియా అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతినడంతో దానిని తాత్కాలికంగా మూసివేసి, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
