Bengaluru Triple Murder: అమ్మవళ్లే నా జీవితం నాశనం.. అందుకే చంపేశా.. కూతురు శ్వేతా సంచలన కామెంట్స్
బెంగళూరులో కన్నవారిని, తోడబుట్టిన చెల్లిని(Bengaluru Triple Murder) అత్యంత ఘోరంగా హతమార్చిన కేసులో ప్రధాన నిందితురాలు శ్వేతను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
Bangalore Police arrested Accused Swetha in triple murder case and hunt boyfriend
- బెంగళూరులో ట్రిపుల్ మర్డర్.
- నిందితురాలు శ్వేత అరెస్ట్.
- ప్రియుడి కోసం పోలీసుల గాలింపు.
Bengaluru Triple Murder: బెంగళూరులో కన్నవారిని, తోడబుట్టిన చెల్లిని అత్యంత ఘోరంగా హతమార్చిన కేసులో ప్రధాన నిందితురాలు శ్వేతను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరి రైల్వేస్టేషన్ సమీపంలోని బీచ్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ఆమెను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తన ప్రియుడు కెన్నెత్తో కలిసి శ్వేత సోమవారం రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లోనే ముగ్గురిని అంతమొందించిన అనంతరం వీరిద్దరూ బైక్పై తమిళనాడుకు పారిపోయారు. మార్గమధ్యంలో బైక్ పాడవడంతో దాన్ని అక్కడే వదిలేసి, శ్వేత ఒంటరిగా బస్సులో పుదుచ్చేరికి చేరుకోగా, పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఆమెను ట్రాక్ చేసి పట్టుకున్నారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు..
పోలీసుల ఎదుట నేర అంగీకారం:
పోలీసుల విచారణలో శ్వేత(Bengaluru Triple Murder) చెప్పిన నిజాలు విస్తుపోయేలా ఉన్నాయి. “నాకు ఇంట్లో అస్సలు స్వేచ్ఛ లేకుండా చేశారు. నిత్యం నన్ను దూషిస్తూ మానసిక క్షోభకు గురిచేసేవారు. నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారు. అందుకే తట్టుకోలేక మా అమ్మను, కుటుంబ సభ్యులను నేనే చంపేశాను” అని పోలీసుల ఎదుట ఆమె నిర్వేదంగా అంగీకరించినట్లు సమాచారం. స్వేచ్ఛ లేదనే కోపంతో కన్నపేగును, తోడబుట్టిన బంధాన్ని కూడా మరిచిపోయి ఇంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.
డైరీలో మానసిక వేదన.. ప్రియుడి కోసం గాలింపు:
కాగా, నిందితురాలు శ్వేత వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె మానసిక స్థితిని ప్రతిబింబించేలా “ఐయామ్ శాడ్. ఐ యామ్ లోన్లీ. ఐయామ్ డిప్రెస్డ్” అని రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రమైన మానసిక వేదన, కుటుంబంతో విభేదాల వల్లే ఆమె ఈ దారి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హత్యల్లో శ్వేతకు సహకరించిన ప్రియుడు కెన్నెత్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
