Uttar Pradesh
UP People Climbed Water Tank : పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాల్లో ఈగలు, దోమలు ఉండటం సహజం. ముఖ్యంగా అపరిశుభ్రతగా ఉండే ప్రాంతాల్లో వీటి సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో అయితే, చెప్పాల్సిన పనిలేదు. ఇదంతా సర్వసాధారణమే అయినప్పటికీ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ప్రజలు ఈగల బెడదను తట్టుకోలేక పోతున్నారట. గ్రామంలో యువతకు పెళ్లిళ్లుకూడా జరగడం లేదట. కొత్తకోడళ్లు గ్రామం విడిచి పోతున్న పరిస్థితి. ఈగల దండు సృష్టించే బీభత్సానికి ఆ గ్రామానికి బంధువులు రాకపోకలు తగ్గిపోయాయంట. దీంతో తమ సమస్యను పరిష్కరించండి బాబోయ్ అంటూ ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కారు. పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని గంటల తరబడి వారితో చర్చలు జరిపిన తరువాత వాటర్ ట్యాంక్ ఎక్కిన వారు కిందికి దిగొచ్చారు.
woman viral video : చీరకట్టుతో రోమ్ వీధుల్లో తిరిగిన భారతీయ మహిళ.. మంత్రముగ్ధులైన ఇటాలియన్లు
ఈ విచిత్ర ఘటన యూపీలోని హర్దోయీ జిల్లా కుయ్య గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామంలో ఈగలు సృష్టించే బీభత్సం అంతాఇంతా కాదు. ఏకంగా ఈగల గోల తట్టుకోలేక గ్రామంలోని కొందరు వాటర్ ట్యాంకర్ ఎక్కి నిరసన తెలిపిన పరిస్థితి. ఈ గ్రామంలో ఈగలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం కోళ్ల ఫారం ఉండటమేనట. దీనికారణంగా ఈగల సంఖ్య గ్రామంలో గణనీయంగా పెరిగింది. ఈగలు ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు తినడానికి, తాగడానికి, స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నామని, దోమ తెరల కింద పడుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు.
Viral Video : వామ్మో.. కిచిడీ కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్న టీచర్, వంట మనిషి.. వీడియో వైరల్
గ్రామంలో ఈగల సమస్య తీవ్రంగా ఉండటంతో కొందరు మహిళలు అత్తారింటిని వదిలేసి వెళ్లిపోతున్నారని, గ్రామంలో యువకులకు పిల్లనిచ్చేందుకు ఇతర గ్రామాల ప్రజలు ముందుకు రావడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలో తమ సమస్యపై పలుసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక గ్రామంలో ఈగల సమస్యను తొలగించాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపినట్లు చెప్పారు. అయితే, గ్రామంలోని కొందరు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్న విషయం పోలీసులకు తెలియడంతో.. పోలీసులు, అధికారులు ఘటన స్థలంకు చేరుకున్నారు. గంటల తరబడి వారితో చర్చలు జరిపిన అనంతరం ఈగల సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు కిందికి దిగొచ్చారు.