Uttarakhand CM: కన్యా పూజలో పాల్గొన్న ఉత్తరాఖాండ్ సీఎం

చైత్ర నవరాత్రుల ఆచారాలలో భాగంగా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం తన నివాసంలో రామ నవమి సందర్భంగా 'కన్యా పూజ' నిర్వహించారు. ఈ సందర్భంగా ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Uttarakhand CM: కన్యా పూజలో పాల్గొన్న ఉత్తరాఖాండ్ సీఎం

Uttarkhand Cm

Updated On : April 10, 2022 / 5:01 PM IST

Uttarakhand CM: చైత్ర నవరాత్రుల ఆచారాలలో భాగంగా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం తన నివాసంలో రామ నవమి సందర్భంగా ‘కన్యా పూజ’ నిర్వహించారు. ఈ సందర్భంగా ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైత్ర నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు.

ఈ కాలంలో, భక్తులు దుర్గా దేవికి ప్రార్థనలను సమర్పించి తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు పాటిస్తారు. చైత్ర నవరాత్రుల తొమ్మిదో రోజును రామ నవమి లేదా శ్రీరాముని పుట్టినరోజుగా జరుపుకుంటారు.

ఈ పవిత్రమైన రోజున, దుర్గాదేవి తొమ్మిది రూపాలకు ప్రతినిధులుగా తొమ్మిది మంది బాలికలను భావిస్తూ.. పూజలు నిర్వహిస్తారు. ‘ప్రసాదాలు’ సమర్పిస్తారు.

Read Also : భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం.. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం