Vande Bharat Trains : కేవలం 14 నిమిషాల్లోనే వందేభారత్ రైలు క్లీనింగ్…ఢిల్లీ కంటోన్మెంటులో అధునాతన విధానానికి శ్రీకారం

Vande Bharat Trains

Vande Bharat Trains : వందేభారత్ రైళ్లను శుభ్రపర్చేందుకు జపాన్ దేశంలో అత్యంత అధునాతనమైన విధానాన్ని భారతీయ రైల్వే ఆదివారం నుంచి అవలంభించనుంది. జపాన్ దేశంలో బుల్లెట్ రైళ్లలో కనిపించే వేగవంతమైన శుభ్రపర్చే విధానాలను అనుకరిస్తూ భారతీయ రైల్వే ఈ కొత్త ప్రయత్నానికి ఆదివారం శ్రీకారం చుట్టింది. (Vande Bharat To Get 14-Minute Cleaning ) 14 నిమిషాల అద్భుతం పేరుతో దేశంలోని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పరిశుభ్రత ప్రమాణాలను అమలు చేయనున్నారు.

Vande Bharat Sleeper Coach : వందేభారత్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త…వచ్చే ఏడాది స్లీపర్ కోచ్‌లు

దీనిలో భాగంగా ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వేస్టేషనులో వందేభారత్ రైళ్లను శుభ్రపర్చే అధునాతన విధానాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. టోక్యో, ఒసాకా రైల్వేస్టేషన్లలో బుల్లెట్ రైళ్లను కేవలం 7 నిమిషాల్లోనే పరిశుభ్రం చేస్తున్నారు. ఈ విధానాన్ని ఆదర్శంగా తీసుకొని భారతీయ రైల్వే కేవలం 14 నిమిషాల్లోనే వందేభారత్ రైళ్లను శుభ్రపర్చనున్నారు.

LPG cylinder : ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధర పెంపు

స్వచ్ఛత-హై-సేవా ప్రచారంలో భాగంగా భారతీయ రైల్వేలోని టెర్మినల్ స్టేషన్లలో అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రారంభించనున్న 14 నిమిషాల అద్భుతం పథకం కింద ఈ రైళ్లను శుభ్రం చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 32 వందేభారత్ రైళ్లలో ఈ స్విఫ్ట్ క్లీనింగ్ మెకానిజంను అవలంభించనున్నారు.

Carpooling : కార్‌పూలింగ్‌పై నిషేధం…బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం

గతంలో రైళ్లను పరిశుభ్రం చేసేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టేది. ఇప్పుడు కేవలం 14 నిమిషాల్లోనే ప్రత్యేక క్లీనింగ్ బృందం శుభ్రపర్చనుంది. దీని కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వందే భారత్ రైలులోని ప్రతి కోచ్‌ను నలుగురు క్లీనింగ్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం శుభ్రపరుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.