LPG cylinder : ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధర పెంపు
దేశంలో మళ్లీ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆదివారం నుంచి మళ్లీ ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 209 పెంచాయి....

Commercial LPG cylinder
LPG cylinder : దేశంలో మళ్లీ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆదివారం నుంచి మళ్లీ ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 209 పెంచాయి. ఈ ధరల పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని చమురు కంపెనీలు తెలిపాయి. (Commercial LPG cylinder prices hiked) చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.158 మేరకు తగ్గించిన నెల తర్వాత ఈ ధరను మళ్లీ పెంచారు.
Carpooling : కార్‌పూలింగ్‌పై నిషేధం…బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం
వాణిజ్య,గృహ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ప్రతి నెల 1వతేదీన నెలవారీ సవరిస్తారు. వాణిజ్య సిలిండర్ల గ్యాస్ ధరను గత నెల కొంచెం తగ్గించి మళ్లీ అధికంగా పెంచారు. దేశంలో నగరాల వారీగా ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ఆదివారం పెరిగిన సిలిండర్ల ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ విధంగా ఉన్నాయి.
Maldives : మాల్దీవుల అధ్యక్షుడిగా మొహహ్మద్ మయిజ్జు విజయం
ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధర ఢిల్లీ నగరంలో రూ.1,731.50, ముంబయిలో రూ. 1684, లక్నోలో రూ.1,845, చెన్నైలో రూ.1,898, బెంగళూరులో రూ. 1,813, కోల్‌కతా నగరంలో 1839రూపాయలుగా ఉంది. ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరల పెంపుతో ప్రజలపై అదనపు భారం పడనుంది.