Manish Sisodia : భార్యను కౌగిలించుకున్న మనీష్ సిసోడియా…చిత్రాన్ని పంచుకున్న సీఎం కేజ్రీవాల్

మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కొద్దిసేపు పరామర్శించేందుకు శనివారం కోర్టు మనీష్ సిసోడియాకు అనుమతి మంజూరు చేసింది....

Manish Sisodia hugging his wife

Manish Sisodia : మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కొద్దిసేపు పరామర్శించేందుకు శనివారం కోర్టు మనీష్ సిసోడియాకు అనుమతి మంజూరు చేసింది. శనివారం తన ఇంట్లో కాసేపు గడిపి జైలుకు బయలుదేరిన సిసోడియాను భార్య సీమా కౌగిలించుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా తన భార్యను ఆలింగనం చేసుకున్న ఫోటోను నెటిజన్లతో పంచుకున్నారు.

ALSO READ : Surat : సూరత్ రైల్వే స్టేషనులో తొక్కిసలాట, ఒకరి మృతి, పలువురికి గాయాలు

దేశంలోని పేద పిల్లలకు ఆశాజనకంగా ఉన్న వ్యక్తికి జరుగుతున్న అన్యాయాన్ని సీఎం కేజ్రీవాల్ ఎత్తి చూపించారు. చాలా బాధాకరమని, తన గుండె తరుక్కుపోతుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం కేసులో చిక్కుకున్న సిసోడియా శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు గంటల పాటు అనారోగ్యంతో ఉన్న తన భార్యను పరామర్శించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. తీహార్ జైలుకు తిరిగి వెళ్లే ముందు కేజ్రీవాల్ షేర్ చేసిన ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ALSO READ : ICC World Cup : వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ బెర్తులు ఖరారు.. అర్హత సాధించిన ఆ నాలుగు జట్లు

శనివారం ఉదయం 10 గంటల సమయంలో జైలు వ్యాన్‌లో సిసోడియా మధుర రోడ్డులోని తన నివాసానికి వచ్చారు. ఈ విరామం సమయంలో సిసోడియా తన ఇంట్లో దీపాలను వెలిగించి ఛోటీ దీపావళి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. సిసోడియా మీడియా సమావేశాలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నారు. సిసోడియా భార్య సీమా సిసోడియా మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో పోరాడుతున్నారు.

ALSO READ : వాట్సాప్‌లోనే ఆధార్, పాన్ డౌన్‌లోడ్ చేయొచ్చు!

నెలలో కోర్టు సిసోడియాను భార్యను పరామర్శించడానికి అనుమతించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై ఫిబ్రవరిలో సిసోడియాను అరెస్టు చేశారు. అతని బెయిల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. మూడు నెలల తర్వాత బెయిల్ కోసం సిసోడియా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.