Viral Video
Viral Video : జమ్మూ స్ట్రీట్‌లో ఓ వ్యాపారి గ్రీన్ చట్నీలో మండుతున్న బొగ్గును వేసాడు. అతను చట్నీ తయారు చేసిన విధానం చూసి నెటిజన్లు క్యాన్సర్ వస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసారు.
రకరకాల స్ట్రీట్ ఫుడ్ తయారు చేసే వారి గురించి విన్నాం. సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూస్తున్నాం. కొన్ని ఆసక్తికరంగా ఉంటే కొన్ని చూసేవారికి వింతగా, భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. తాజాగా జమ్మూ స్ట్రీట్‌లో ఓ వ్యాపారి తయారు చేసిన చట్నీ చూస్తే చాలామందిలో ఆందోళన కలిగింది.
జమ్మూలో స్ట్రీట్ ఫుట్ వెండర్ ‘ఆగ్ వాలీ చట్నీ’ అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేసాడు. ప్లేట్‌లో రెండు పెద్ద బొగ్గు ముక్కల్ని ఉంచాడు.. బొగ్గును నిప్పు మీద వెలిగించి గ్రీన్ చట్నీ ఉన్న కంటైనర్లోకి వేసాడు. కొన్ని నిముషాల పాటు కంటైనర్ మూత వేసి ఉంచి తర్వాత చట్నీని కలియతిప్పి అందరికీ అందించాడు. అతను చట్నీ తయారు చేసిన విధానాన్ని చాలామంది వింతగా చూసారు. బొగ్గువల్ల ఆహారాన్ని ఎలా తింటామని భావించారు. thatdelhifoodie అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోకి ‘ఆగ్ వాలీ చట్నీని ధుని చట్నీ అని కూడా పిలుస్తారు.. ఎక్కడంటే గుల్షన్ నాన్, జమ్మూ’ అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ వీడియో నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. ‘ఇలా బొగ్గును కలపడం క్యాన్సర్ కారకం.. కనీసం అధ్యయనం చేయండి’ అని.. చాలామంది ‘క్యాన్సర్ చట్నీ’ అని కామెంట్లు చేసారు. చూసిన వారి ఇంత ఆందోళన పడితే తినేవారు ఎలా ఆస్వాదించారో మరి.