Nagpur Metro : నాగపూర్ మెట్రోలో మహిళల ఫ్యాషన్ షో.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

మెట్రోలో ఫ్యాషన్ షోలు మొదలయ్యాయి. నాగపూర్ మెట్రోలో కొందరు మహిళలు చేసిన ఫ్యాషన్ వాక్ చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు. ఈ ఫ్యాషన్ షోకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Nagpur Metro

Nagpur Metro- Fashion Show : మెట్రోలో డ్యాన్స్‌లు, ఫైటింగ్‌లు, ఎక్సర్ సైజ్‌లు, రీల్స్, ముద్దులు ఇవన్నీ అయిపోయాయి.. ఇక ఫ్యాషన్ షోలు మొదలయ్యాయి. తాజాగా నాగపూర్ మెట్రోలో జరిగిన ఫ్యాషన్ షో ప్రయాణికుల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంటర్నెట్‌లో ఫ్యాషన్ షో వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: మెట్రోలో యువకుల మధ్య భీకర పోరు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

మెట్రోలో కొంతమంది చేస్తున్న వింత చేష్టలకు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు కంప్లైంట్ చేసినా రోజూ  వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా నాగపూర్ మెట్రోలో ఫ్యాషన్ షో జరిగింది. అమీర్ షేక్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో వైట్ కలర్ ఫ్రాక్‌తో మహిళ ఫ్యాషన్ షో ప్రారంభించింది. ఇక ఆమె వెనుక అనేకమంది అమ్మాయిలు, పిల్లలు రంగురంగుల దుస్తుల్లో వాక్ చేసుకుంటూ వెళ్తారు. ప్రయాణికులు వారికి ఫోటోలు, వీడియోలు తీయడం కనిపిస్తుంది.

Delhi Metro : రణరంగంగా మారిన మెట్రో.. లేడీస్ కోచ్ ఎక్కిన వ్యక్తితో ఇద్దరు మహిళలు వాగ్వాదం.. వీడియో వైరల్

‘నాగపూర్ మెట్రోలో ఫ్యాషన్ వాక్’ అనే శీర్షికతో ఈ పోస్టును షేర్ చేశారు. ఈ వీడియోపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.