Delhi Metro : రణరంగంగా మారిన మెట్రో.. లేడీస్ కోచ్ ఎక్కిన వ్యక్తితో ఇద్దరు మహిళలు వాగ్వాదం.. వీడియో వైరల్
ఢిల్లీ మెట్రో రణరంగంగా మారింది. లేడీస్ కోచ్‌లోకి ఎక్కిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Delhi Metro
Delhi Metro : ఢిల్లీ మెట్రో రణరంగంగా మారింది. లేడీస్ కోచ్‌లోకి ఓ వ్యక్తి ఎక్కడంతో ఇద్దరు మహిళలు అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్
ఢిల్లీ మెట్రోలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజా వీడియో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడి మధ్య మాటల యుద్ధాన్ని చూపించింది. ట్విట్టర్ యూజర్ @gharkekalesh షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి లేడీస్ కోచ్‌లోకి ఎక్కాడు. ఈ విషయాన్ని ఓ మహిళా ప్రయాణికురాలు ప్రశ్నిస్తూ అతనిని వీడియో తీసింది. తాను మెట్రో నిబంధనలకు విరుద్ధంగా ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని ఆ వ్యక్తి చెప్పే ప్రయత్నం చేశాడు. అతని వెంట ఉన్న మరో మహిళ వీడియో తీస్తున్న మహిళను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఓ దశలో వీరి మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువతుల పోల్ డ్యాన్స్ .. DMRC ఎందుకు పట్టించుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్
ఇదంతా గమనిస్తున్న మరో మహిళ లేడీస్ కోచ్‌లోకి ఎలా ఎక్కుతారని ప్రశ్నించింది. తరువాత స్టేషన్‌లో దిగమని సలహా ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ మెట్రో ఫైటింగ్‌లకు మంచి ప్లేస్‌గా మారిందని కొందరు.. ఢిల్లీ మెట్రోలో ఏదైనా సాధ్యమనిట’ ట్వీట్ చేశారు. ఢిల్లీ మెట్రోలో మహిళలు ఎక్కువగా సీట్ల విషయంలో గొడవలు పడటం , తన్నుకునే వరకు వెళ్లడం కామనే.
Kalesh b/w Ladies and a Guy over He Stepped up Into ladies Coach in Delhi Metro pic.twitter.com/wzks795oqW
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2023