Police In Lockup: పోలీసుల్నే లాకప్‌లో ఉంచి, తాళం వేసిన ఎస్పీ.. బయటపడ్డ వీడియో.. తాను ఆ పని చేయలేదన్న ఎస్పీ

డ్యూటీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న కారణంతో కింది స్థాయి సిబ్బంది విషయంలో అనుచితంగా ప్రవర్తించాడో ఎస్పీ. ఒక పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలను లాకప్‌లో ఉంచి తాళం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Police In Lockup: డ్యూటీ సరిగ్గా చేయట్లేదనే కారణంతో ఎస్సైలతోసహా ఒక పోలీస్ స్టేషన్‌లోని సిబ్బందిని లాకప్‌లో వేసి తాళం వేశాడో ఎస్పీ. ఈ ఘటన బిహార్‌లోని నవాడా పట్టణంలో ఈ నెల 8న జరిగింది. నవాడాలోని పోలీస్ స్టేషన్ రివ్యూకు వచ్చారు ఎస్పీ గౌరవ్ మంగ్లా.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

రాత్రి తొమ్మిది గంటల సమయంలో తనిఖీ చేశారు. అయితే, అక్కడ విధుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వారిని లాకప్‌లో ఉంచి తాళం వేశాడు ఎస్పీ. ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలను అర్ధరాత్రి లాకప్‌లో వేసి దాదాపు రెండు గంటలపాటు ఉంచాడు. తర్వాత వదిలిపెట్టాడు. ఈ విషయం బయటకు రావడంతో దీనిపై ఎస్పీ, ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ సింగ్ స్పందించారు. ఈ వార్తలో నిజం లేదన్నారు. తాను అలాంటి పని చేయలేదని ఎస్పీ చెప్పాడు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశాడు. కానీ, మరుసటి రోజు ఈ వీడియోకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన వీడియో బయటపడింది. దీంతో ఎస్పీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

JEE Advanced Results: నేడు విడుదల కానున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు

ఈ ఘటనపై విచారణ జరిపించాలని పోలీసు అధికారుల సంఘమైన ‘బిహార్ పోలీస్ అసోసియేషన్’ డిమాండ్ చేసింది. ఘటనపై విచారణ జరిపి బాధ్యుడైన ఎస్పీ గౌరవ్ మంగ్లాపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసు సంఘం అధ్యక్షుడు మృత్యుంజయ్ కుమార్ సింగ్ స్పందించారు. తాను ఈ అంశంపై మాట్లాడేందుకు ఎస్పీకి కాల్ చేసినప్పటికీ, ఆయన తన కాల్ రిసీవ్ చేసుకోవడం లేదని, సీసీ టీవీ కెమెరా వీడియోలను ఎస్పీ ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.