ఆసుపత్రిలో చేరిన నటుడు విజయకాంత్

డిఎమ్‌డికె వ్యవస్థాపకుడు, నటుడు విజయకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు..

ఆసుపత్రిలో చేరిన నటుడు విజయకాంత్

Vijaykanth

Updated On : May 19, 2021 / 11:02 AM IST

Acter Vijayakanth :డిఎమ్‌డికె వ్యవస్థాపకుడు, నటుడు విజయకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా గత కొన్నేళ్లుగా ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.

దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. మరోవైపు సాధారణ ఆరోగ్య పరీక్షలకోసం ఆసుపత్రిలో చేరినట్లు డిఎమ్‌డికె పార్టీ పత్రికా ప్రకటన పేర్కొంది. ఒకటి లేదా రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని భావిస్తున్నారు. విజయకాంత్ ఆరోగ్యంపై ఆసుపత్రి నుండి వివరాలు రావాల్సి ఉంది.