వీళ్ల భక్తి పాడుగాను: టాయ్ లెట్ కు పూజలు..దణ్ణాలు

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 07:33 AM IST
వీళ్ల భక్తి పాడుగాను: టాయ్ లెట్ కు పూజలు..దణ్ణాలు

Updated On : November 9, 2019 / 7:33 AM IST

మరుగు దొడ్డికి పూజలు..ఇది ఎక్కడన్నా చూశామా? కనీసం విన్నామా? భక్తి ఉండటం మంచిదే కానీ అది మూఢత్వం కాకూడదు.అటువంటి మూఢత్వమే టాయ్ లెట్ కు దణ్ణాలు పెట్టుకోవటం. తాము  రోజు దణ్ణం పెట్టుకునేది ఓ టాయ్ లెట్ కు అని తెలుసుకుని సిగ్గుపడ్డారు  కొంతమంది భక్తిపరులు.అలా ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా సంవత్సం పాటు గుడి అని భ్రమించి మరుగుదొడ్డికి దణ్ణాలు పెట్టుకున్నారు. ఇది యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలోని మౌదాహా గ్రామంలో జరిగింది. 

వివారల్లోకి వెళితే..రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ రంగులు వేసేయటం ఇటీవల వింటున్నాం..చూస్తున్నాం..యూపీలో కూడా అదే జరిగింది. ఓ భవనం చాలా రోజుల నుంచి మూసివేసి ఉంది.  ఆ భవనానికి  కాషాయ రంగు  వేసి ఉంది. చాలా కాలం నుంచి అది మూసివేయబడి ఉండటంతో అది గుడి అని అనుకున్నారు.లోపల దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయని భావించారు. గుడి తలుపులు ఎందుకు తీయటంలేదో అని అనుకుని మూసి ఉన్న తలుపుల వద్దే నిలబడి దణ్ణాలు పెట్టుకోవటం మొదలు పెట్టారు.  కానీ అది టాయిలెట్ల భవనం అని తెలుసుకుని షాకయ్యారు. అయ్యో..ఇప్పటిదాకా టాయ్ లెట్ కు దణ్ణాలు పెట్టుకుని పూజించామా? అంటూ తెగ ఆశ్చర్యపోయారు సదరు భక్తులు. 

ఈ విషయంపై స్థానికుడు రాకేష్ చందేల్ మాట్లాడుతూ..కమ్యునిటీ హెల్త్ సెంటర్‌ పక్కనే ఈ టాయిలెట్‌ను నిర్మించారు. దీని డిజైన్ కూడా దేవాలయం రూపంలోనే ఉంటుంది. పైగా..దీనికి కాషాయం రంగు వేయడంతో ప్రజలంతా ఈ టాయ్ లెట్ ను దేవాలయంగా భావించి ఇలా చేసేవారని చెప్పాడు. అది టాయిలెట్ కాదని కొంతమంది అధికారులు ఆ గ్రామానికి వచ్చిన సందర్భంగా చెప్పేవరకు ప్రజలు నమ్మలేదు. దీంతో ఇంకెవరూ భ్రమ పడకుండా.. ఆ టాయిలెట్‌కు రంగు మార్చి వేరే రంగు వేశారని అని తెలిపాడు.

కాగా..2018లోనే ఈ టాయిలెట్ పూర్తయినా కొన్ని కారణాల వల్ల దాన్ని ప్రారంభించలేదు. దీంతో కనీసం ఇప్పటికైనా ప్రారంభిస్తారా లేదా అని అనుకుంటున్నారు స్థానికులు. కాగా..ఈ టాయిలెట్‌కు ప్రభుత్వమే కాషాయ రంగు వేయించిందా లేదా కాంట్రాక్టర్ నేతల మెప్పించటానికి ఆ రంగు వేశాడా అని అనుమానిస్తున్నారు స్థానికులు. మరి ఇప్పటికైనా ఆ టాయ్ లెట్ ను ప్రారంభిస్తోరో లేదో అధికారులకు కూడా తెలీదట.