Viral Video: డ్యాన్స్ చేసిన ఏనుగు.. అదుర్స్ అంటున్న నెటిజన్లు
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

భారతీయ సంగీతం వింటే పరవశించిపోయి నృత్యం చేస్తాం. ఆ సంగీతానికి భరత నాట్యంతోడైతే చూడముచ్చటగా ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలు భరత నాట్యం చేస్తుంటే ఓ ఏనుగు కూడా అదే పని చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఏనుగు డ్యాన్సును చూసిన నెటిజన్లు ‘వావ్’ అని అనకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియోను sharanrockers_memes అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే 35 లక్షల లైకులు వచ్చాయి.
ఆ అమ్మాయిల కన్నా ఏనుగే అద్భుతంగా డ్యాన్స్ చేసిందని కొందరు కామెంట్లు చేశారు. ఏనుగు డ్యాన్స్‌ను చూడడం ఇదే మొదటిసారని ఓ యూజర్ పేర్కొన్నాడు. ఆ ఏనుగు ఎంజాయ్ చేస్తున్న తీరు మెస్మరైజింగ్‌గా ఉందని కొందరు కామెంట్లు చేశారు.
View this post on Instagram
Viral Video: జైలు నుంచి విడుదలై.. అదిరిపోయే డ్యాన్స్ చేసిన యువకుడు