×
Ad

Video: పండగ రోజు పొద్దుపొద్దున్నే మద్యం తాగి.. ఈ యువకులు ఏం చేశారో చూడండి.. ఇప్పుడు దసరాను ఎలా జరుపుకోవాలి?

భారీ జనసందోహం ముందు దహనం చేయాల్సిన దిష్టిబొమ్మ ఉదయాన్నే మంటల్లో కాలి పోయింది.

Video: దసరా రోజున సాయంత్రం పూట ఊరంతా ఒక్క చోట చేరి రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసి పండుగ చేసుకుంటాం. అందుకోసం రావణుడి దిష్టిబొమ్మను ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాం. అలా పండుగ కోసం తయారు చేసుకున్న రావణుడి భారీ దిష్టిబొమ్మను కొందరు తాగుబోతులు పొద్దుపొద్దున్నే తగులబెట్టాశారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ బాగ్ ముంగలియా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్నో దశాబ్దాలుగా ఊరిలో రావణుడిని దసరా సందర్భంగా ఆచారాలు పాటిస్తూ కాల్చుతారు. ఇప్పుడు తాగుబోతు యువకులు చేసిన పనికి ఆ ఆచారాలు లేకుండానే పండగ జరుపుకోవాల్సి వచ్చింది. (Video)

Also Read: అడవిలో రాయి కింద రక్తపు మడుగులో కనపడ్డ శిశువు.. కన్నీరు తెప్పిస్తున్న మూడు రోజుల పసికందు కథ

రావణ దహనం నిర్వాహకులు ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఆ దిష్టిబొమ్మ మంటల్లో కాలిపోతున్న విషయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భారీ జనసందోహం ముందు దహనం చేయాల్సిన దిష్టిబొమ్మ ఉదయాన్నే మంటల్లో కాలి పోయిందని అన్నారు.

రావణుడి దిష్టిబొమ్మ కాలిపోతున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో తీసిన వ్యక్తి మాట్లాడుతూ.. “వాళ్లు ఎరుపు రంగు కారులో వచ్చారు. ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు. వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. వాళ్లు మద్యం, సిగరెట్లు తాగారు. కొత్త కారులో వచ్చారు.. దానికి రిజిస్ట్రేషన్ నంబరు లేదు” అని అన్నాడు.

దసరా వేడుకలలో భాగంగా రాక్షస రాజు రావణుడు భారీ దిష్టిబొమ్మలను దేశవ్యాప్తంగా అనేక చోట్ల కాల్చేస్తారు. చెడుపై సాధించిన విజయానికి సూచికగా ఇలా చేస్తారు. ఈ దిష్టిబొమ్మల్లో బాణసంచా కూడా ఉంచుతారు.