Video: ఛాతీపై రతన్ టాటా ముఖాన్ని టాటూగా వేయించుకున్న యువకుడు.. ఎందుకంటే?

తన స్నేహితుడికి క్యాన్సర్ వచ్చిందని, దీంతో నెలకు వేలాది రూపాయల్లో వచ్చే వైద్య బిల్లులను భరించలేకపోయాడని చెప్పారు.

మనకు ఇష్టమైన వారి పేర్లను, బొమ్మలను పచ్చబొట్టుగా పొడిపించుకుంటుంటాం. అలాగే, ఓ వ్యక్తి తాజాగా.. దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ముఖాన్ని తన ఛాతీపై టాటూగా వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

టాటూ ఆర్టిస్ట్ మహేశ్ చవాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. రతన్ టాటా ఫేస్‌ను టాటూగా ఎందుకు వేయించుకున్నావని ఆ వ్యక్తిని మహేశ్ చవాన్ అడిగితే ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

రతన్ టాటా సేవాగుణాన్ని గుర్తు చేశారు. తన స్నేహితుడికి క్యాన్సర్ వచ్చిందని, దీంతో నెలకు వేలాది రూపాయల్లో వచ్చే వైద్య బిల్లులను భరించలేకపోయాడని చెప్పారు. క్యాన్సర్‌తో పోరాడలేకపోయిన తన స్నేహితుడికి చివరకు టాటా ట్రస్ట్‌ గురించి తెలిసిందని, దాని సాయంతో వైద్యం చేయించుకున్నాడని చెప్పారు.

తన స్నేహితుడికి ఉచితంగా వైద్య చికిత్స అందిందని అన్నారు. టాటా ట్రస్ట్‌ల ద్వారా ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయని తెలిపారు. అంతేకాదు, ఈ అనుభవం ద్వారా తాను రతన్ టాటా ఆదర్శాలను అనుసరించడానికి ప్రేరేపించిందని చెప్పారు. తాను రతన్‌ టాటాను నిజజీవిత దేవుడిగా భావిస్తానని అన్నారు. రతన్ టాటా అందించిన అమూల్యమైన సహకారానికి ఒక చిన్న గుర్తుగా ఆయన ముఖాన్ని టాటూగా వేయించుకున్నానని తెలిపారు.

Sai Durgha Tej : పడి లేచిన కెరటం.. సాయి దుర్గా తేజ్.. 100 కోట్ల సినిమాతో గ్రాండ్ కంబ్యాక్.. బర్త్ డే స్పెషల్..