Sai Durgha Tej : పడి లేచిన కెరటం.. సాయి దుర్గా తేజ్.. 100 కోట్ల సినిమాతో గ్రాండ్ కంబ్యాక్.. బర్త్ డే స్పెషల్..

కెరీర్ లో అయిపోయాడు అనుకున్నప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు. లైఫ్ కూడా అయిపొయింది అనుకున్నప్పుడు కష్టాలు పడైనా సరే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు.

Sai Durgha Tej : పడి లేచిన కెరటం.. సాయి దుర్గా తేజ్.. 100 కోట్ల సినిమాతో గ్రాండ్ కంబ్యాక్.. బర్త్ డే స్పెషల్..

Sai Durgha Tej Birthday Special Story Grand Come Back in Life and Career

Updated On : October 15, 2024 / 10:39 AM IST

Sai Durgha Tej : మెగా మేనల్లుడుగా సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఈ క్రమంలో విజయాల కంటే అపజయాలు ఎక్కువ పలకరించాయి. తన మామయ్యల మేనరిజంలను కాపీ చేస్తున్నాడని, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడని, ఇలాగె చేస్తే కెరీర్ కష్టమే అని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

వరుసగా ఆరు ఫ్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే ప్రతిరోజు పండగే, సోలో బతుకు సో బెటర్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు తేజ్. ఆల్రెడీ కెరీర్లో పడి లేచిన తర్వాత హమ్మయ్య లైఫ్ బాగానే సాగుతుంది అనుకునే సమయంలో బైక్ యాక్సిడెంట్ అయి తన జీవితాన్నే మార్చేసింది. 2021 లో సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ జరగ్గా తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం, చాలా రోజుల తర్వాత అతి కష్టం మీద సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడు.

Also Read : Pushpa : మావోయిస్టు ప్రాంతంలో పుష్ప 50 రోజులు ఆడింది.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్..

ఆ సమయంలో మామయ్య పవన్ కళ్యాణ్ తేజ్ కి అండగా నిలబడ్డాడు. తేజ్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ వచ్చారు. కోలుకున్నాడు కానీ మళ్ళీ సినిమాల్లోకి వస్తాడా అని అందరూ చర్చించుకున్నారు. మాట కూడా రాని పరిస్థితుల్లో, డ్యాన్సులు, ఫైట్లు చేయలేని పరిస్థితుల్లో కేవలం బతికి ఉన్నాను అనే పరిస్థితుల నుంచి బయటపడాలని సాయి తేజ్ గట్టిగా సంకల్పించుకున్నాడు. ఫిజియోథెరపీలు, డాక్టర్ల సలహాలు తీసుకుంటూనే తన తల్లి సహాయంతో మళ్ళీ మాట్లాడటం నేర్చుకున్నాడు.

Image

ఓ సారి యాక్సిడెంట్ తర్వాత తాను కోలుకోడానికి తన తల్లి ఎంతగా సపోర్ట్ చేసిందో, మళ్ళీ ఒక చిన్నపిల్లాడిలా తనను చూసుకుందని చెప్పాడు. అందుకే ఇటీవల తన పేరు సాయి ధరమ్ తేజ్ ని తన తల్లి పేరు జత చేసి సాయి దుర్గ తేజ్ అని మార్చుకున్నాడు. తేజ్ పూర్తిగా కోలుకోడానికి రెండేళ్లు పట్టింది. అతని కెరీర్, లైఫ్ అయిపొయింది అని అన్నవాళ్ళ నోర్లు మళ్ళీ మూయించాడు. ఈసారి కంబ్యాక్ విరూపాక్ష సినిమాతో ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అదిరిపోయేలా ఇచ్చాడు. వెంటనే మామయ్యతో కలిసి బ్రో సినిమాతో మెప్పించాడు. అయితే ఇంకా తన మాటల్లో తడబాటు, ఆరోగ్య పరంగా ఇంకా ఫిట్ అవ్వాలని కొంచెం గ్యాప్ తీసుకొని తన బాడీ, మాటలు, హెల్త్ మీద ఫోకస్ చేసి త్వరలో భారీ సినిమాతో రాబోతున్నాడు. SDT18 సినిమా ఏకంగా 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కెరీర్ లో అయిపోయాడు అనుకున్నప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు. లైఫ్ కూడా అయిపొయింది అనుకున్నప్పుడు కష్టాలు పడైనా సరే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. అందుకే అందరూ సాయి తేజ్ ని పడి లేచిన కెరటం అంటున్నారు.

Image

ఇక యాక్సిడెంట్ తర్వాత లైఫ్ మరింత మార్చుకున్నాడు. అందరితో మంచిగా ఉండటం, అందరికి సపోర్ట్ చేయడం, అందరికి సాయం చేయడం.. తనలోని మంచినంతా బయటపెడుతున్నాడు. ప్రతి వారం రిలీజయ్యే ప్రతి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తాడు తేజ్. సమస్యల గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తాడు. తన మామయ్య గెలుపుని సెలబ్రేట్ చేసుకున్నాడు. వేరే వాళ్ళ సినిమా ఈవెంట్స్ కి వచ్చి సపోర్ట్ చేస్తాడు. యాక్సిడెంట్ తర్వాత కూడా చాలా మందికి దానాలు చేసాడు. అమ్మ ఆశ్రమానికి, పావలా శ్యామలకు, వరద బాధితులకు, పిల్లల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కు ఇలా దానాలు చేస్తూనే ఉన్నాడు. తనలో మంచితనం నింపుకొని పూర్తిగా తన లైఫ్ స్టైల్ మార్చుకొని సమాజంలో ఒక మంచి వ్యక్తిగా బతుకుతూ అభిమానుల కోసం సినిమాలు తీస్తూ మళ్ళీ బిజీ అవుతున్నాడు సాయి దుర్గ తేజ్.

Also Read : Devi Sri Prasad : సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా అందరికి సొంతమే.. అలా చెప్పడం తప్పు.. DSP కామెంట్స్ వైరల్..