Viral Video: ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు? రూపాయి ఖర్చులేకుండా భలే చేశావ్..

Viral Video Pune boy
Viral Video: మెట్రో సిటీలో నివసించే వారికి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాగే, కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. మెట్రో సిటీల్లో జనాభా ఎక్కువ. దీంతో క్యాబ్‌లు, ఆటోలు కూడా బిజీగా ఉంటాయి. సమయానికి అవి దొరకకపోతే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది.
అయితే, ఓ యువకుడు చాలా తెలివిగా ఆలోచించి, ఉచితంగా బైకుపై ఇంటికి వెళ్లాడు. అది ఎలాగో తెలుపుతూ ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు. ఉచితంగా బైకుపై ప్రయాణించిన ఆ యువకుడిని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు? ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ఏంటా ఐడియా?
మహారాష్ట్రలోని పూణేకు చెందిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ సార్థక్ సచ్‌దేవా ఓ ప్రాంతానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రావడానికి క్యాబ్/ఆటో బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఎంతకీ బుక్ కాకపోవడంతో దగ్గరలోని ఓ రెస్టారెంట్లోకి వెళ్లి కూర్చున్నాడు. అదే రెస్టారెంటు పేరు నుంచి పిజ్జా తీసుకురావాలని జొమాటో యాప్ లో ఆర్డర్ ఇచ్చాడు.
తన ఇంటి అడ్రస్సును ఆ యాప్ ఆర్డర్ లో పొందుపర్చాడు. ఇంతలో జొమాటో బాయ్ వచ్చి రెస్టారెంట్లో పిజ్జా తీసుకుని సార్థక్ సచ్‌దేవా ఇంటికి బయలుదేరబోయాడు. జొమాటో బాయ్ వద్దకు వచ్చిన సార్థక్ ఆ పిజ్జాను తానే ఆర్డర్ చేశానని, తాను కూడా బైకుపై వస్తానని కోరాడు. సార్థక్ ను జొమాటో బాయ్ బైకుపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లాక జొమాటో బాయ్ కి కూడా సార్థక్ పిజ్జా తినిపించాడు.
View this post on Instagram
Lucknow : ఇండియాలోనే ఖరీదైన ఈ స్వీట్ ధర కేజీ రూ.50 వేలు.. అంత రేటెందుకంటే?